Pakistan Cricket Board : పాకిస్తాన్ దేశంలో నిర్వహిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత్ నిరాకరించిన నేపథ్యంలోనే ఆ దేశ జాతీయ జెండా కరాచీ నేషనల్ స్టేడియంలో ఎగరవేయలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై విమర్శలు వినిపించాయి. సోషల్ మీడియా నెటిజన్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు స్పందించింది. తమ దేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాడుతున్న దేశాల జెండాలను మాత్రమే కరాచీ నేషనల్ స్టేడియంలో ఎగరవేశామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెబుతోంది. ” పాకిస్తాన్లో జరుగుతున్న ఛాంపియన్ ట్రోఫీలో భారత్ ఆడేందుకు ఇష్టపడలేదు. హైబ్రిడ్ విధానంలో అయితేనే తాము ఆడతామని ఐసీసీకి స్పష్టం చేసింది. దీంతో భారత దుబాయ్ వేదికగా మ్యాచులు ఆడుతోంది. అలాంటప్పుడు మా దేశంలో ఆడుతున్న దేశాల జాతీయ జెండాలను మాత్రమే కరాచి నేషనల్ స్టేడియం, రావల్పిండి గడాఫీ స్టేడియంలో ఆయా దేశాల జాతీయ జెండాలను ఎగరవేశామని” పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి.. ” కరాచీలో భారత్ మాత్రమే కాదు బంగ్లాదేశ్ జెండా కూడా ఎందుకు ఎగరవేయలేదని” పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధులను పాత్రికేయులు ప్రశ్నించగా..” భారత జట్టు దుబాయ్ లో తన మ్యాచులు ఆడుతోంది. బంగ్లాదేశ్ జట్టు ఇంతవరకు పాకిస్తాన్ రాలేదు.. అందువల్లే ఆ రెండు దేశాల జెండాలను ఎగరవేయలేదు.. పాకిస్తాన్ వేదికగా మ్యాచ్లు ఆడేందుకు వచ్చిన దేశాల జాతీయ జెండాలను గౌరవంగా ఎగరవేశామని” పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
దురుద్దేశం లేదు
” మా దేశంలో క్రికెట్ విస్తరణకు ఛాంపియన్స్ ట్రోఫీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. అందువల్లే మా వంతుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం. భారత్, బంగ్లాదేశ్ జాతీయ జెండాలను ఎగరవేయకుండా ఉండడంలో ఎటువంటి దురుద్దేశం లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తి నిరాధారమైనది. ఈ విషయంపై మేము వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆధారాలు లేకుండా వివాదాన్ని సృష్టించారు. ఇలా వివాదం సృష్టించిన వ్యక్తుల లక్ష్యం ఏమిటో మాకు తెలుసు. వాస్తవాలు లేకుండా.. నకిలీ వార్తలతో పాకిస్థాన్ ప్రదర్శన దెబ్బతీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా పోటీలను వివిధ వేదికలలో నిర్వహిస్తాం. ఆ ప్రాంతాలలోనే ఆయా దేశాల జాతీయ జెండాలను ఎగరవేస్తామని” పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు పేర్కొన్నారు.
అందువల్లే వెళ్లలేదు
భద్రతాపరమైన సమస్యలు, రాజకీయ ఉద్రిక్తతల వల్ల పాకిస్తాన్లో ఆడేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో ఐసీసీ హైబ్రిడ్ మోడ్ లో భారత్ ఆడే మ్యాచ్లను నిర్వహిస్తోంది.. అందువల్ల భారత్ దుబాయ్ వేదికగా మ్యాచులు ఆడుతుంది.. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు పాకిస్థాన్లో కరాచీ, లాహోర్, రావల్పిండి లో నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ వీధులలో, రహదారులలో బ్యానర్లు ఏర్పాటు చేశారు.. మరోవైపు పాకిస్తాన్ 1996లో ప్రపంచ కప్ కు సహా ఆతిథ్యం ఇచ్చింది. 2017 తర్వాత ఈ టోర్నీ జరుగుతోంది. నేపథ్యంలో ఈ మెగా కప్ నిర్వహణ విజయవంతం కావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆత్రుతగా ఎదురుచూస్తోంది.
No Indian flag in Karachi: As only the Indian team faced security issues in Pakistan and refused to play Champions Trophy matches in Pakistan, the PCB removed the Indian flag from the Karachi stadium while keeping the flags of the other guest playing nations. pic.twitter.com/rjM9LcWQXs
— Arsalan (@Arslan1245) February 16, 2025