Homeక్రీడలుక్రికెట్‌Nitish Kumar Reddy Injury: ఐర్లాండ్ సిరీస్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి ఔట్.. కారణమిదే

Nitish Kumar Reddy Injury: ఐర్లాండ్ సిరీస్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి ఔట్.. కారణమిదే

Nitish Kumar Reddy Injury: ఇటీవలి ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో టీమిండియా అదరగొట్టింది. ఏకైక టెస్ట్ మాత్రమే కాకుండా.. 3 వన్డేలు కూడా గెలిచి సత్తా చూపించింది. తద్వారా 2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందు ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంది. టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ తర్వాత తదుపరి ఐర్లాండ్ లో పర్యటించబోతోంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ ఆడుతుంది.

ఈ రెండు టోర్నీలకు సంబంధించి మేనేజ్మెంట్ ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఈ రెండు సిరీస్ లు ప్రారంభం కాకముందే టీమ్ ఇండియాకు బ్యాడ్ న్యూస్ లు ఎదురయ్యాయి. దీంతో మేనేజ్మెంట్ ఆలోచనలో పడి.. వేగంగా నిర్ణయాలు తీసుకుంది. వాస్తవానికి ఇటీవల కాలంలో టీం ఇండియాలో ఇలా జరగలేదు. దీంతో మేనేజ్మెంట్ చాకచక్యంగా వ్యవహరించి.. సరికొత్త నిర్ణయాలు తీసుకుంది.

ఐర్లాండ్ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ ఆడుతుంది టీమ్ ఇండియా. ఈ సిరీస్ లు ప్రారంభం కాకముందే టీమ్ ఇండియా ప్లేయర్లకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. కీలకమైన ప్లేయర్లు గాయాల బారిన పడుతున్నారు. దీంతో వారు సిరీస్ లో నుంచి తప్పుకుంటున్నారు. ఇప్పటికే మాయాజాలికుడు వరుణ్ చక్రవర్తి టి20 జట్టు నుంచి తప్పుకున్నాడు. ఈ జాబితాలో ఇప్పుడు మళ్లీ తెలుగు యువకుడు చేరిపోయాడు. అతడే నితీష్ కుమార్ రెడ్డి. తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న అతడు టి20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఐర్లాండ్ మాత్రమే కాకుండా.. ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా అతడు ఆడే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో సూర్యాంష్ కు మేనేజ్మెంట్ చోటు ఇచ్చింది.

తొడ కండరాలు గాయంతో బాధపడుతున్న నితీష్.. పూర్తిస్థాయిలో సామర్థ్యం సంపాదించడానికి నాలుగువారాల సమయం పడుతుంది. ఆ తర్వాత తనను తాను నిరూపించుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. అందువల్లే అతడు ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ లకు దూరమయ్యాడు..సూర్యాంష్ కు చోటు దక్కిన నేపథ్యంలో అతడి గురించి చర్చ మొదలైంది.. ఇటీవల అతడు శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ట్రై సిరీస్ లో అదరగొట్టాడు.. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన అతడు ఐదు మ్యాచ్లలో 147 పరుగులు చేశాడు. బంతితో కూడా ఆకట్టుకున్నాడు.

సూర్యాంష్ 2024- 25 కాలంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు తరఫున ఆడాడు. 131 పరుగులు చేశాడు.. మరోవైపు ఈ నెలలో 26 నుంచి 28 మధ్య ఐర్లాండ్లో టీమ్ ఇండియా పర్యటిస్తుంది. రెండు టి20 మ్యాచ్ లు ఆడుతుంది. అనంతరం వచ్చే నెల ఒకటి నుంచి 11వ తేదీల మధ్య ఇంగ్లాండ్ జట్టుతో టీం ఇండియా 5 t20 మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular