Homeక్రీడలుక్రికెట్‌New Zealand Vs Canada T20 World Cup: టి20 వరల్డ్ కప్ లో సంచలనం..ఆఫ్ఘనిస్తాన్...

New Zealand Vs Canada T20 World Cup: టి20 వరల్డ్ కప్ లో సంచలనం..ఆఫ్ఘనిస్తాన్ కొంపముంచిన కెనడా.. సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చిన జట్టు ఏదంటే?

New Zealand Vs Canada T20 World Cup: భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో సంచలనాల మీద సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. శ్రీలంక జట్టు కంగారులకు చుక్కలు చూపించింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చేదే. ఇంగ్లాండ్.. న్యూజిలాండ్ జట్లు కూడా చిన్న చెట్ల చేతిలో ఇబ్బంది పడ్డాయి. టీమిండియా అమెరికా చేతిలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈసారి జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో అద్భుతాలకు కొదవలేదు.

ఆసియా ఖండంలో అత్యంత సంచలనాత్మకమైన జట్టుగా పేరుపొందింది ఆఫ్గనిస్తాన్. ఈ జట్టు ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో సూపర్ 8 లోకి ఎంట్రీ ఇస్తుందని అందరూ అనుకున్నారు. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో వెంట్రుక వాసి లో విజయాన్ని కోల్పోయింది. ఈ మ్యాచ్ కంటే ముందు న్యూజిలాండ్ తో పోటీ పడింది ఆఫ్ఘనిస్తాన్. ఆ మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. రెండు మ్యాచ్లలో ఓడిపోయిన తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. దీంతో ఆఫ్గనిస్తాన్ సూపర్ 8 కు వెళ్లాలంటే.. న్యూజిలాండ్ జట్టును కెనడా ఖచ్చితంగా ఓడించాలి.

మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో కెనడా 173/4 పరుగులు చేయడంతో ఆఫ్గనిస్తాన్ ప్లేయర్లలో సానుకూల దృక్పథం వ్యక్తం అయింది. అయితే న్యూజిలాండ్ జట్టు 174 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 8 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కెనడా ఓడిపోవడంతో ఆఫ్గనిస్తాన్ జట్టుకు ఆశలు లేకుండా పోయాయి. ఆఫ్ఘనిస్తాన్ తన లీగ్ సమరంలో కెనడా జట్టుతో చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే విజయంతో ఆఫ్గనిస్తాన్ టోర్నీని ముగిస్తుంది. ఒకవేళ ఓడిపోతే నిరాశతో ఇంటికి వెళ్ళిపోతుంది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆఫ్గనిస్తాన్ గెలిస్తే.. దక్షిణాఫ్రికాలో జరిగిన మ్యాచ్లో మరింత బలమైన పోరాటం చేస్తే.. కచ్చితంగా సూపర్ 8 కు వెళ్ళేది.

ఆఫ్గనిస్తాన్ జట్టులో బలమైన బ్యాటర్లు ఉన్నారు. బౌలర్లు కూడా అదే స్థాయిలో ఉన్నారు. కొన్ని సందర్భాలలో ఆటగాళ్లు ఒత్తిడికి గురి కావడంతో ఆఫ్గనిస్తాన్ జట్టు సానుకూల ఫలితాలను అందుకోలేకపోయింది. 2023 వన్డే వరల్డ్ కప్ లో సెమీఫైనల్ దాకా వచ్చింది ఆఫ్గనిస్తాన్. అలాగే 2024 t20 వరల్డ్ కప్ లో కూడా అద్భుతమైన విజయాలు సాధించింది. కానీ ఈసారి జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular