Naman Dhir
Naman Dhir : లక్నో జట్టులో ఓపెనర్లు మిచెల్ మార్ష్(60), మార్క్ రం(53) అదరగొట్టారు. హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ముంబై బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు.. వీరిద్దరు తొలి వికెట్ కు ఏడు ఓవర్లలో 76 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఆయుష్ బదోని (30), డేవిడ్ మిల్లర్ (27) సత్తా చాటడంతో లక్నో జట్టు 203 పరుగులు చేసింది. ముంబై జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Mumbai Indians team captain Hardik Pandya) ఐదు వికెట్లు పడగొట్టాడు. మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ.. చివర్లో ముంబై ఇండియన్స్ బౌలర్లు లయ తప్పారు. దీంతో ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్ లాంటివాళ్ళు దూకుడుగా ఆడారు.. ఫలితంగా లక్నో జట్టు స్కోరు 200 పరుగులు దాటిపోయింది.. దీంతో ముంబై ఎదుట భారీ విజయ లక్ష్యం ఉంచింది.
Also Read : అది ధోని క్రేజ్ అంటే.. కోహ్లీ, రోహిత్ కూడా సైడ్ అయిపోయారు!
పరుగుల వరద
204 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఒపెనర్లు శుభారంబాన్ని అందించలేకపోయారు.. రికెల్టన్(10), జాక్స్(5) తీవ్రంగా నిరాశపరిచారు.. రికెల్టన్ శార్దూల్ ఠాకూర్, జాక్స్ ఆకాష్ దీప్ బౌలింగ్లో ఔట్ అయ్యారు. ఈ దశలో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (28*), నమన్ ధీర్(46) ఆకట్టుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 35 బంతుల్లో 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఆఫ్ సెంచరీ దిశగా వెళుతున్న నమన్ ధీర్.. దిగ్వేష్ రాటి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. దీంతో ముంబై జట్టులో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు సైతం ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. గత మ్యాచ్లో పంజాబ్ జట్టు ఆటగాడిని “సంతకంతో” గేలి చేసిన దిగ్వేష్.. ఈసారి మాత్రం కాస్త క్రమశిక్షణతోనే ఉన్నాడు. ఐపీఎల్ క్రమశిక్షణ కమిటీ మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో అతడు కాస్త గాడిలో పడ్డాడు. ఇక నమన్ ధీర్ మైదానంలో ఉన్నంతసేపు మెరుపులు మెరూపించాడు. ముఖ్యంగా నాలుగో ఓవర్ లో ఆకాష్ దీప్ బౌలింగ్లో 21 పరుగులు పిండుకున్నాడు.. తొలి బంతిని సిక్సర్ గా.. మరుసటి బంతిని సిక్సర్ గా మలిచిన నమన్ ధీర్.. ఆ తర్వాత రెండు బంతులను కూడా ఫోర్లుగా బౌండరీలకు తరలించాడు. చివరి బంతికి సింగిల్ తీసిన అతడు.. మొత్తం కట్ 21 పరుగులు పిండుకున్నాడు. నీతో అప్పటిదాకా 25/2 పరుగుల వద్ద ఉన్న ముంబై జట్టు స్కోర్.. ఒక్కసారిగా 46 /2 పరుగులకు చేరుకుంది. నమన్ ధీర్ కూడా తన వ్యక్తిగత స్కోర్ ను 9 పరుగుల నుంచి 30కి పెంచుకున్నాడు. అయితే అతడు 30 పరుగులను కేవలం 9 బంతుల్లోనే పూర్తి చేయడం విశేషం..
Also Read : RCB పై ఇతడి అభిమానం వేరే లెవెల్..
6, 6, 4, 4 – #NamanDhir goes berserk in Akash Deep's over
Recovery mode for #MI!
Watch LIVE action ➡ https://t.co/nH2UGjQY0t #IPLonJioStar #LSGvMI, LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/zedojpShc0
— Star Sports (@StarSportsIndia) April 4, 2025
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Naman dhir lucknow bowler single over ipl
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com