IPL 2025 : ఐపీఎల్ ఏ ముహూర్తాన మొదలైందో తెలియదు కాని.. ప్రతి ఎండాకాలం భారతీయుల్లో మెజారిటీ ప్రజలకు వినోదాన్ని అందించే సాధనం అయిపోయింది.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. జాతీయ జట్ల కంటే ఐపీఎల్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఐపీఎల్ లో సగటు క్రికెట్ అభిమానికి ధోని, కోహ్లీ, రోహిత్ పేర్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. ఎందుకంటే వీరు అంతలా పెనవేసుకొని పోయారు. ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే చర్చ గతంలో అనేకసార్లు జరిగింది.
Also Read : కావ్య పాప ఐదేళ్లు నీ మీద ఎంత పెట్టుబడి పెట్టిందో తెలుసా.. రేయ్ ఇంత మోసమా?
క్రికెట్ ఐకాన్ గా ధోని
గొప్ప క్రికెటర్లు ఎవరు అనే చర్చ సాగుతూనే ఉంది. అయితే దీనికి ఇంతవరకు ఎండ్ కార్డ్ పడకపోయినప్పటికీ.. గత మార్చి నెలలో ఏ ఐపీఎల్ ఆటగాడి గురించి సామాజిక మాధ్యమాలలో అభిమానులు ఎక్కువగా చర్చించిన దానికి సంబంధించిన జాబితా ఒకటి విడుదలైంది. అందులో ఇండియన్ క్రికెట్ లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) అగ్రభాగంలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ కు ధోని వీడ్కోలు పలికినప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఐపీఎల్ లో అతడు ఆడుతూనే ఉన్నాడు. 43 సంవత్సరాల వయసులోనూ చురుకుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. క్రికెట్ మాత్రమే కాకుండా వ్యాపారం, ఇతర కార్యక్రమాలు, బ్రాండ్ అండర్స్మెంట్ లో ధోని కనిపిస్తూనే ఉన్నాడు. ఇక ధోని తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్, దూకుడయిన మనస్తత్వం అతడిని రెండవ స్థానంలో నిలిపాయి. కోహ్లీ ఎండార్స్మెంట్ డీల్స్, ఫిట్నెస్ కూడా అభిమానుల్లో చర్చకు కారణమయ్యాయి.. ధోని, కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ స్థానాన్ని సంపాదించుకున్నాడు. టి20 మినహా మిగతా ఫార్మాట్లో టీమ్ ఇండియాకు రోహిత్ నాయకత్వం వహిస్తున్నాడు. ఐపీఎల్ లో ముంబై జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. తనదైన నాయకత్వ ప్రతిభతో రోహిత్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడు. రోహిత్ తర్వాత హార్దిక్ పాండ్యా, హెడ్ మిగతా స్థానాలలో నిలిచారు. ఇక ఈ జాబితాలో అన్ని విభాగాలలో ఉన్న వ్యక్తులలో టాప్ -5 స్థానాల్లో ధోని, విరాట్ కోహ్లీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రోహిత్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలిచారు. “ధోని వయసు 43 సంవత్సరాలు. అయినప్పటికీ అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. అతడి గురించే సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్నది.. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి ఇన్ని సంవత్సరాలు దాటుతున్నప్పటికీ.. ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదంటే.. అతడు ఎలాంటి ఆటగాడు అర్థం చేసుకోవచ్చని”సోషల్ మీడియాలో మహేంద్ర సింగ్ ధోని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : రాహుల్ ను చూశాక కూడా.. పంత్.. నీ బతుకు పగోడికి కూడా రావద్దు సామీ.