IPL : సమకాలీన క్రికెట్లో ఎంతోమంది గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉండవచ్చు గాక. కానీ క్రికెట్ కు అందాన్ని తెచ్చి.. గౌరవాన్ని తెచ్చి.. శిఖర స్థానంలో నిలబెట్టిన ఆటగాళ్లు కొంతమందే ఉన్నారు. అందులో కమిందు మెండిస్ (kamindu Mendis) కచ్చితంగా ఉంటాడు.. ముందు వరుసలోనే అతడు స్థానం సంపాదించుకుంటాడు. ఎందుకంటే అతడు ఆట మీద చూపించిన ప్రేమ అటువంటిది. ఆట మీద ప్రదర్శించిన గౌరవం అటువంటిది. ఆట కోసం చేసిన త్యాగం అటువంటిది. అందువల్లే అతడు సోషల్ మీడియాలో, మీడియాలో ప్రముఖంగా నీరాజనాలు అందుకుంటున్నాడు..”ఎంత మంచి వాడవు రా.. ఎన్ని నాళ్ళు పొగుడుదురా” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాడు.
Also Read : ఐదుసార్లు MI ని IPL విజేతగా నిలిపితే.. డ్రింక్స్ బాయ్ ని చేశారు..
క్యాన్సిల్ చేసుకున్నాడు
2025 ఐపీఎల్(IPL)కు సంబంధించి కమిందు మెండిస్ (kamindu Mendis) ను సన్ రైజర్స్ హైదరాబాద్(sun risers Hyderabad) యాజమాన్యం 75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే అతడికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన తొలి మూడు మ్యాచ్ లలో అవకాశం రాలేదు. ఇక ఇటీవల కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ కమిందు మెండిస్ (kamindu Mendis) కు అవకాశం ఇచ్చాడు. ఒక్క ఓవర్ మాత్రమే కమిందు మెండిస్ (kamindu Mendis) బౌలింగ్ చేశాడు.. నాలుగు పరుగులు ఇచ్చి.. హాఫ్ సెంచరీ చేసి దూకుడు మీద ఉన్న రఘువంశీని అవుట్ చేశాడు. రెండు చేతులతో స్పిన్ బౌలింగ్ వేయడం కమిందు మెండిస్ (kamindu Mendis) ప్రత్యేకత.. ఇక బ్యాటింగ్ లోనూ 20 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ఆడేందుకు కమిందు మెండిస్ (kamindu Mendis) ఎవరూ చేయని త్యాగం చేశాడు. ఇటీవల కమిందు మెండిస్ (kamindu Mendis) తన స్నేహితురాలు నిష్ని ని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ హనీ మూన్ కూడా ప్లాన్ చేసుకున్నారు.. అయితే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగే మ్యాచ్ కోసం అతడు హనీ మూన్ క్యాన్సిల్ చేసుకున్నాడు.. ఈ విషయం జాతీయ మీడియాలో తెగ ప్రసారం అవుతోంది.. ” అతడు జట్టు కోసం గొప్ప త్యాగం చేశాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్ పడగొట్టి.. 27 పరుగులు కూడా చేశాడు. అంతేకాదు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగే మ్యాచ్ కోసం అతడు తన హనీ మూన్ కూడా క్యాన్సల్ చేసుకున్నాడు. ఇటువంటి ఆటగాడు దొరకడం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చేసుకున్న అదృష్టమని” నేషనల్ మీడియా తన కథనాలలో ప్రస్తావించడం గమనార్హం.
Also Read : IPL లో అద్భుతం.. రెండు చేతులతో బౌలింగ్.. ఒక వికెట్ కూడా..