IPL 2025 : బెంగళూరు(Royal challengers Bengaluru) జట్టులో సమర్థవంతమైన ఆటగాళ్లు ఉన్నారు. అయినప్పటికీ బెంగళూరు జట్టు ట్రోఫీలను దక్కించుకోలేకపోతోంది. కీలకమైన దశలో ఓడిపోతూ అభిమానుల ఆశలను ఆడియాసలు చేస్తోంది. అయితే ఈసారి మాత్రం బెంగళూరు జట్టు సరికొత్తగా కనిపిస్తోంది.. ఆడిన తొలి మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్(Kolkata knight riders) జట్టును ఓడించింది. డిపెండింగ్ ఛాంపియన్స్ ను నేలకు దించింది..ఇక చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) ను వారి సొంత మైదానమైన చెన్నై చిదంబరం స్టేడియంలో బెంగళూరు ఓడించింది. 17 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. ఇవన్నీ కూడా బెంగళూరు జట్టుకు అనుకూలంగా ఉన్నాయి.. దీంతో బెంగళూరు జట్టు అభిమానులు ఈసాలా కప్ నమదే అంటూ ఎగిరి గంతులు వేస్తున్నారు.
Also Read: నిత్యానంద స్వామి చనిపోయారా? ఇందులో నిజమెంత?
ఓ ఆటో డ్రైవర్ మాత్రం..
ఇంతవరకు ఐపీఎల్ సీజన్లో ఒక్కసారి కూడా విజేతగా కాకపోయినప్పటికీ.. బెంగళూరు జట్టుకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. బెంగళూరు జట్టు సొంతమైదానంలో మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు తండోపతండలుగా వస్తుంటారు. చిన్నస్వామి స్టేడియాన్ని జనసంద్రంగా మార్చేస్తుంటారు. అయితే బెంగళూరు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ఓ ఆటో డ్రైవర్ వినూత్నప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. అందులో బెంగళూరు తలపడుతున్నప్పుడు.. బెంగళూరు జెర్సీ వేసుకున్న అభిమానులకు ఉచితంగా ఆటోలో ప్రయాణాన్ని కల్పించే సాహసానికి అతడు శ్రీకారం చుట్టాడు. అంతేకాదు బెంగళూరు జెర్సీ ధరించిన అభిమానులకు తన ఆటోలో ఉచిత ప్రయాణం అంటూ అతడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశాడు. దానికి విపరీతమైన ఆదరణ లభిస్తున్నది. దీంతో అతడు సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.. అతడి ఫోటోను సోషల్ మీడియాలో బెంగళూరు అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు.. అభిమాని అంటే ఇలా ఉండాలని.. ఇలాంటి అభిమానులే బెంగళూరు జట్టుకు శ్రీరామరక్ష అని వ్యాఖ్యానిస్తున్నారు..” నీ కోసమైనా బెంగళూరు జట్టు విజయం సాధించాలి. ఐపీఎల్ ట్రోఫీ అందుకోవాలి. 17 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలకాలి. ఇలాంటి అభిమానులు బెంగళూరు జట్టుకు మరింత బలాన్ని ఇవ్వాలని” సోషల్ మీడియాలో బెంగళూరు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
అన్ బాక్స్ వేడుకలో..
ఐపీఎల్ ప్రారంభానికి ముందు బెంగళూరు జట్టు యాజమాన్యం చిన్నస్వామి స్టేడియంలో అన్ బాక్స్ పేరుతో వేడుక నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి బెంగళూరు అభిమానులను ఆహ్వానిస్తుంది. అయితే ఈసారి మాత్రం బెంగళూరు అభిమానులు ముక్తకంఠంతో ఈసారి కచ్చితంగా ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకోవాల్సిందేనని నినాదాలు చేశారు.. దీంతో బెంగళూరు ఆటగాళ్లు కూడా అభిమానుల కోరికను తీర్చుతామని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ సీజన్లో బెంగళూరు జట్టు ఇప్పటివరకు వరుసగా రెండు విజయాలు సాధించింది. కోల్ కతా, చెన్నై జట్లపై గెలుపులు సొంతం చేసుకుని పాయింట్లు పట్టికలో ప్రథమ స్థానంలో కొనసాగుతోంది.
Also Read : త్రిభాషా విధానంపై వివాదం.. యోగి–స్టాలిన్ డైలాగ్ వార్!