MS Dhoni: గత రికార్డుల మాదిరిగా చెన్నై జట్టు ప్రస్తుత ఐపిఎల్ లో ఆడలేక పోతోంది.. వరుసగా ఓటములు ఎదుర్కొంటూ ప్లే ఆఫ్ అవకాశాలను పూర్తిగా దూరం చేసుకుంది. ఒకవేళ చెన్నై జట్టు ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే దాదాపు అద్భుతాలు జరగాలి. అవి జరిగే అవకాశం లేదు కాబట్టి చెన్నై జట్టు పెట్టే బేడా సర్దుకుని ఇంటికి వెళ్లిపోవడమే ఇక మిగిలింది. చెన్నై జట్టు మిగతా ఐదు మ్యాచులు వరుసగా గెలిచినప్పటికీ ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం లేదు. ప్రస్తుతం చెన్నై జట్టుకు ధోని నాయకత్వం వహిస్తున్నప్పటికీ.. ఆ జట్టు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. వరుసగా ఓటములు ఎదుర్కొంటూ పరువు తీసుకుంటున్నది..
Also Read: వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా..కోల్ కతా పై పంజాబ్ సరికొత్త రికార్డు
ధోని నిస్సహాయత
ఐపీఎల్ లో చెన్నై జట్టు వరుసగా ఓటములు ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు కెప్టెన్ ధోని తన పూర్వపు ప్రభను కోల్పోయాడు. నిరాశగా కనిపిస్తున్నాడు. నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నాడు.. జట్టు ఆడుతున్న తీరుపై అతడు ఒకింత నిర్వేదంలో ఉన్నాడు. ” జట్టులో ఐదారుగురు ఆటగాళ్లు విఫలమవుతుంటే అనుకూలమైన ఫలితాలు సాధించడం వీలుపడదు. హైదరాబాద్ చేతిలో ఎదురైన ఓటమి అలాంటిదే. జట్టులో రెండు మూడు లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆటగాళ్లు ఏమాత్రం ఆడకపోతే గెలిచే అవకాశం ఎలా సాధ్యమవుతుంది. మ్యాచ్ లో అందరూ ఆటగాళ్లు అద్భుతంగా ఆడాలి. జట్టు కోసం తీవ్రంగా కష్టపడాలి. విజయం కోసం శ్రమించాలి. అవేవీ జరగనప్పుడు విజయం మీద ఆశలు పెట్టుకోవడం అడియాసే అవుతుంది. 9 మ్యాచ్లు ఇప్పటివరకు చెన్నై ఆడింది. 19 మంది ఆటగాళ్లను ప్రయోగించింది. అయినప్పటికీ ఏం జరిగింది.. రకరకాల మేలవింపులు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో జట్టులో కొత్తదనాన్ని ఆశించడం సరైన విధానం కాదు.. అందువల్ల ఆటగాళ్లు ఎవరి పాత్ర వారు పోషించాలి. లేనిపక్షంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని” ధోని పేర్కొన్నాడు.” ఎక్కువమంది ఆటగాళ్లు విఫలమవుతున్నారు. మార్పులు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. మిడిల్ ఓవర్లలో బ్యాటర్లు స్పిన్నర్లను ఎటాక్ చేయలేకపోతున్నారు. ఇక బౌలింగ్లో కూడా అంతంతమాత్రంగానే ప్రతిభ చూపిస్తున్నారు. అలాంటప్పుడు జట్టు విజయాలు సాధించడం సాధ్యం కాదు.. ఇన్ని కారణాలు చెన్నై జట్టు ఓడిపోవడానికి హేతువులు అవుతున్నాయని” ధోని పేర్కొన్నాడు. మొత్తంగా చూస్తే చెన్నై జట్టు పట్ల ధోని అంత సుముఖంగా లేడు. సుదీర్ఘ క్రికెట్ ఆడుతున్న ధోని గతంలో ఎన్నడు కూడా తోటి ఆటగాళ్లపై ఇలాంటి విమర్శలు చేయలేదు. అయితే జట్టుకూర్పు విషయంలో మొదటి నుంచి కూడా ధోని ఒక రకమైన నిరాశను వ్యక్తం చేస్తున్నాడు. ఆటగాళ్లు సరిగ్గా లేకపోవడం వల్ల విజయాలు సాధ్యం కావడం లేదని అతడు వాపోతున్నాడు. అయితే మెగా వేలంలో జట్టు కొంతమంది ప్లేయర్లను వదిలేయడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సుదీర్ఘమైన అనుభవం ఉన్నప్పటికీ చెన్నై జట్టు మేనేజ్మెంట్ ఇలా చేయడం రుచించడం లేదని వారు అంటున్నారు.
Also Read: ఈసారీ అదే “ఏడు”పు.. మాక్స్ వెల్ నిన్ను మోస్తున్న పంజాబ్ జట్టు మేనేజ్మెంట్ కు ఓ దండం!