Maxwell : గత సీజన్లో మాక్స్ వెల్ బెంగళూరు జట్టు తరఫున దారుణంగా ఆడాడు. ఆ జట్టు మేనేజ్మెంట్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. వాటిని వమ్ము చేశాడు. పదేపదే అవకాశాలు ఇస్తున్నప్పటికీ అతడు సద్వినియోగం చేసుకోలేకపోవడంతో బెంగళూరు జట్టు యాజమాన్యం అతడిని పక్కన పెట్టింది. మెగా వేలంలో అతడిని వదులుకుంది. బెంగళూరు వదులుకున్న దరిద్రాన్ని పంజాబ్ నెత్తిన పెట్టుకుంది. భీకరంగా బ్యాటింగ్ చేస్తాడు.. బీభత్సంగా ఆడతాడు అని గొప్పలు పోయి ఏకంగా 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతడు జట్టు భారాన్ని ఏమాత్రం మోయలేకపోగా.. మరింత దారుణంగా ఆడుతున్నాడు.. 2024 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్లో ఆడిన మ్యాచ్లలో మాక్స్ వెల్ చేసిన పరుగులు 100.. అతడి స్ట్రైక్ రేట్ 108.69 అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు శనివారం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో మాక్స్ వెల్ కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లోటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో మాక్స్ వెల్ అవుట్ కావడం ఇది ఐదోసారి. గడచిన ఏడు ఇన్నింగ్స్ లలో ఐదుసార్లు వరుణ్ చక్రవర్తి చేతిలోనే అవుట్ అయ్యాడంటే మాక్స్ వెల్ ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.
Also Read : ప్రభ్ సిమ్రాన్ సింగ్.. పంజాబ్ బాహుబలి.. ఓపెనర్ అంటే నీలా ఆడాలి..
15 ఇన్నింగ్స్ లలో..
మాక్స్ వెల్ గడచిన 15 ఇన్నింగ్స్ లలో అతని హైయెస్ట్ స్కోర్ 30 పరుగులు మాత్రమే. వాస్తవానికి దూకుడుగా ఆడే మాక్స్ వెల్ ఇలా విఫలమవుతుండడం అతడి అభిమానులకు రుచించడం లేదు. అసలు అతడు ఇలా ఎందుకు ఆడుతున్నాడో వారికి ఏమాత్రం అంతు పట్టడం లేదు. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకైతే బీభత్సంగా బ్యాటింగ్ చేస్తాడు మాక్స్ వెల్. వాస్తవానికి అతని స్థాయికి భీకరమైన ఇన్నింగ్స్ ఆడాలి. ఐపీఎల్ లో సరికొత్త చరిత్రలు సృష్టించాలి. అరుదైన ఘనతలను అందుకోవాలి. అదే దరిద్రమో గాని..మాక్స్ వెల్ వీటన్నిటికీ దూరంగా ఉంటున్నాడు. అసలు ఎందుకు ఆడుతున్నాడో.. ఎందుకు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాడో ఏమాత్రం అర్థం కావడం లేదు. అసలు ఇంతలా విఫలమవుతున్నప్పటికీ పంజాబ్ జట్టు మేనేజ్మెంట్ అతడికి అలా ఎందుకు అవకాశాలు ఇస్తున్నదో ఏమాత్రం అంతుపట్టడం లేదు. శనివారం నాటి మ్యాచ్లో కోల్ కతా పై పంజాబ్ ఓపెనర్లు వీర విహారం చేశారు. కానీ అదే జోరు గనుక మిగతా ఆటగాళ్లు కొనసాగించి ఉంటే పంజాబ్ జట్టు స్కోర్ ఎక్కడికో వెళ్ళేది. కానీ మాక్స్ వెల్ లాంటి ఆటగాడికి అవకాశం ఇవ్వడం వల్ల స్కోరు ముందుకు వెళ్లకపోగా.. అతడు ప్రారంభంలో ఉన్న చేతులెత్తేయడం కోల్ కతా జట్టుపై పాలు పోసింది. పంజాబ్ జట్టు ఆశలను అడియాసలు చేసింది.
Also Read : ఒంటి చేత్తో క్యాచ్..మరో చేత్తో మ్యాచ్.. SRH పాలిట సూపర్ హీరో ఇతడు