Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన సినిమాలు ఆయనను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అందుకే మెగాస్టార్ చిరంజీవి(Chitanjeevi) అంటే చాలామందికి ప్రత్యేకమైన అభిమానమైతే ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే చిరంజీవి చేసిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచాయి. కానీ ఇండస్ట్రీ హిట్ గా కన్వర్ట్ కాలేకపోయాయి. కారణం ఏదైనా కూడా ఆ సినిమాలు సక్సెస్ లను అందుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి చేసిన ఇంద్ర (Indra) సినిమా ఇండస్ట్రీ హిట్ గా మారింది. కానీ ఆ తర్వాత చేసిన ఠాగూర్ (Tagore) సినిమా ఇండస్ట్రీ హిట్ గా కన్వర్ట్ కాలేకపోయింది. కారణం ఏంటి అంటే ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించినప్పటికి అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ సినిమాని రిపీటెడ్ గా జనాలు చూడలేకపోయారు. తద్వారా ఇంద్రకి వచ్చిన కలెక్షన్స్ ని ఠాగూర్ సినిమా బ్రేక్ చేయలేకపోయింది. అందువల్లే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా కన్వర్ట్ కాలేక పోయింది…
Also Read : నేడు ఈడీ విచారణకు హాజరు కానున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..!
కరప్షన్ మీద ఫైట్ చేసే సినిమాగా ఠాగూర్ సినిమాకి మంచి గుర్తింపు అయితే లభించింది. తమిళంలో సూపర్ హిట్ అయిన రమణ (Ramana) సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెర్కెక్కినప్పటికి వివి వినాయక్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు.
మొత్తానికైతే సినిమాలో చిరంజీవిని చాలా స్టైలిష్ గా చూపించడమే కాకుండా ఆయనకంటూ ఒక సెపరేట్ క్యారెక్టరైజేషన్ ను క్రియేట్ చేయడంలో కూడా వినాయక్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అయినప్పటికి ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా కన్వర్ట్ అయితే బాగుండేదని చాలామంది అభిమానులు కోరుకున్నారు.
కానీ అది మాత్రం జరగలేదు. మరి ఏది ఏమైనా కూడా బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సాధించింది. ఇక చిరంజీవి ఆ తర్వాత కాలంలో పాలిటిక్స్ లోకి రావడానికి ఈ సినిమా చాలా వరకు హెల్ప్ చేసిందనే చెప్పాలి… ఇక ప్రస్తుతం చిరంజీవి 70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీలు ఇస్తూ సినిమాలు చేస్తూ వరుస సక్సెస్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు.
Also Read : మెగా అభిమానులు మర్చిపోలేని రోజుగా మారనున్న మే9..చరిత్రలో ఇదే తొలిసారి!