KKR Vs PBKS IPL 2025: 11 పాయింట్లుతో పంజాబ్ జట్టు నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. బెంగళూరు మూడో స్థానంలోకి వెళ్లిపోయింది. ముంబై జట్టు ఐదవ స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో కనుక పంజాబ్ గెలిచి ఉంటే మూడో స్థానానికి చేరుకునేది. అప్పుడు బెంగళూరు నాలుగో స్థానంలోకి వచ్చేది. ఇక ముంబై ఐదవ స్థానంలో ఉండేది. ముంబై ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగే మ్యాచ్లో తలపడుతోంది. ఇక ఇటీవల లక్నో జట్టు పై ముంబై 12 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో లక్నో జట్టు ప్రతీకారం తీర్చుకుంటుందా? ముంబై జట్టు విజయ యాత్రను కొనసాగిస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే.. కొన్ని గంటలు ఆగాల్సిందే. ఇప్పటికే వరుస విజయాలతో ముంబై ఎదురన్నది లేకుండా ఆడుతోంది. ఆ జట్టు ఏకంగా 5వ స్థానంలోకి వచ్చేసింది. ఇక లక్నో కూడా ఆరో స్థానంలో ఉంది. ఇటీవల ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో ఓటమిపాలైంది. దీంతో లక్నో పాయింట్ల పరంగా ముంబై జట్టుకు దిగువ స్థానంలో ఉంది. ఇక శనివారం నాటి కోల్ కతా – పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ వర్షం వల్ల రద్దయినప్పటికీ.. పంజాబ్ ప్లేయర్లు ఘనమైన రికార్డులు సాధించారు. ముఖ్యంగా ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య సరికొత్త రికార్డు సృష్టించారు. అయితే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై ఒక వికెట్ కు అత్యధిక పరుగులు జోడించిన ద్వయంగా మాత్రం వృద్ధిమాన్ సహా, మానన్ వోహ్రా కొనసాగుతున్నారు. 2014లో బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సాహా, వోహ్రా మూడో వికెట్ కు 129 పరుగులు జోడించారు. ఇప్పటివరకు ఇదే పంజాబ్ జట్టు తరుపున కోల్ కతా పై హైయెస్ట్ రికార్డుగా ఉంది.. ఇక 2025లో ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య తొలి వికెట్ కు 120 పరుగులు జోడించారు. 2018లో గేల్, కేఎల్ రాహుల్ కోల్ కతా వేదికగా జరిగిన మ్యాచ్లో 116 పరుగులు తొలి వికెట్ కు జోడించారు. 2020లో అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్లో మాయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ తొలి వికెట్ కు 115 పరుగులు జోడించారు. గేల్, మన్ దీప్ సింగ్ 2020లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్ లో రెండో వికెట్ కు 100 పరుగులు జోడించారు..
Also Read: గతంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇలా ఆడింది. కానీ ఈసారే అష్ట దరిద్రం తాండవం చేస్తోంది
ఆకాశమే హద్దు
కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దూకుడుగా బ్యాటింగ్ చేశారు. కోల్ కతా బౌలర్లకు వారి సొంత వేదిక పైన చుక్కలు చూపించారు. మొత్తంగా తాము ఎంత ప్రమాదకరమైన ఆటగాళ్లమో నిరూపించారు. తొలి వికెట్ కు 120 పరుగులు జోడించి వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు విఫలం కావడంతో.. ఊహించినంత భారీ స్కోరు ను పంజాబ్ జట్టు చేయలేకపోయింది. అయితే ఆ తర్వాత వర్షం భారీగా కురవడంతో కోల్ కతా జట్టుకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దీంతో రెండు జట్లకు సమానంగా పాయింట్ కేటాయిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ సీజన్లో ఇప్పటివరకు వర్షం వల్ల రద్దయిన మ్యాచ్ ఇదే కావడం విశేషం.
Also Read: ఈసారీ అదే “ఏడు”పు.. మాక్స్ వెల్ నిన్ను మోస్తున్న పంజాబ్ జట్టు మేనేజ్మెంట్ కు ఓ దండం!