Mohammed Shami : రంజాన్ నెలను ముస్లింలు అత్యంత పవిత్రంగా భావిస్తారు. నిష్టగా ఉపవాసం ఉంటారు. ఈ నెలలో ఉపవాసం ఉంటే అల్లాకు అత్యంత దగ్గర అవుతామని ముస్లింలు భావిస్తుంటారు. ఇక మన దేశ జాతీయ క్రికెట్ జట్టులో ఎంతోమంది ముస్లింలు ఉన్నారు. అజహారుద్దీన్ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అద్భుతమైన విజయాలు అందించాడు. మహమ్మద్ కైఫ్, జహీర్ ఖాన్, సర్ప రాజ్ అహ్మద్.. ఇలా చెప్పుకుంటూ పోతే ముస్లిం ఆటగాళ్లు భారత జట్టులో చాలామంది ఉన్నారు. ప్రస్తుతం టీమిండియాలో మహమ్మద్ షఫీ, మహమ్మద్ సిరాజ్ కీలక బౌలర్లుగా ఉన్నారు. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో మహమ్మద్ షఫీ కీలక బౌలర్ గా ఉన్నాడు. భారత జట్టు పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. బుమ్రా లేని లోటును భర్తీ చేస్తున్నాడు. బంగ్లాదేశ్ జట్టుపై ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు.
Also Read : లీగ్ దశలో ఓడిందని.. తేలిగ్గా చూడొద్దు.. న్యూజిలాండ్ అంటేనే పక్కలో బల్లెం
షమీపై వివాదం
రంజాన్ మాసంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మహమ్మద్ షమీ డ్రింక్ (అది నీరసాన్ని తగ్గించేది) తాగాడు. అయితే దీనిని కొంతమంది ముస్లిం పెద్దలు వివాదంగా మార్చారు. రంజాన్ మాసంలో మహమ్మద్ షమీ అలా డ్రింక్ తాగడం నేరమని AIMZ అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రిజ్వీ మండిపడ్డారు. మహమ్మద్ షమీ అల్లాను క్షమించాలని కోరుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.. ఈ క్రమంలో సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ పవర్ స్పందించారు. ” షమీ భారతీయుడు. భారతదేశానికి ఆడుతున్నప్పుడు ఇవన్నీ లెక్కలోకి రావని” పవర్ పేర్కొన్నాడు. మరోవైపు ఈ వివాదంలో మహమ్మద్ షమీ సోదరుడు జైద్ స్పందించాడు..” ముల్లాలు మత గ్రంథాలు చదవాలి. పాక్ జట్టు మొత్తం డ్రింక్స్ తాగడం కనిపించలేదా? రంజాన్ సమయంలో అందరూ పవిత్రంగా ఉంటారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అల్లాను నిష్టగా పూజిస్తారు. ఉదయం, సాయంత్రం నమాజ్ చేస్తారు. ఇందులో ఎవరికి తగ్గట్టుగా వారు ఉపవాసం ఉంటారు. అంటే తప్ప దేశాన్ని బట్టి.. ప్లేయర్లను బట్టి ఉపవాసాలు ఉండవు. మహమ్మద్ షమీ అప్పటికి కఠిన ఉపవాసం ఉన్నాడు. మైదానంలో ఆడుతున్నాడు కాబట్టి హెల్త్ డ్రింక్ మాత్రమే తాగాడు. అత్యంత కఠిన పరిస్థితుల మధ్య బౌలింగ్ చేస్తున్నప్పటికీ మహమ్మద్ షమీ తన నిష్టను కోల్పోలేదు. కొంతమంది దీనిని వేరే విధంగా చూస్తున్నారు. పాకిస్తాన్ ప్లేయర్లను ఒక విధంగా.. భారత బౌలర్ ను ఒక విధంగా చూడడం న్యాయం కాదు. ఇప్పటికైనా వారు తమ తీరు మార్చుకోవాలని” జైద్ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఈ వివాదంపై మరి కొంతమంది ముస్లిం పెద్దలు స్పందించారు. మహమ్మద్ షమీ విషయంలో ముల్లాలు అలా మాట్లాడాల్సి ఉండకూడదని.. అలాంటి వ్యాఖ్యలు చేయడం వారి తీరుకు సరికాదని జైద్ పేర్కొన్నాడు.
Also Read : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముందు న్యూజిలాండ్ జట్టుకు కోలు కోలేని షాక్..