Homeఎంటర్టైన్మెంట్ Kona Venkat : వి.వి వినాయక్ కారణంగానే అఖిల్ కెరీర్ ఇలా అయ్యింది అంటూ రచయిత...

 Kona Venkat : వి.వి వినాయక్ కారణంగానే అఖిల్ కెరీర్ ఇలా అయ్యింది అంటూ రచయిత కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్!

Kona Venkat : అప్పట్లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) తనయుడు, అక్కినేని అఖిల్(Akkineni Akhil) మొదటి సినిమా ‘అఖిల్ – ది పవర్ ఆఫ్ జువ్వ’ అనే చిత్రం పై ఎలాంటి క్రేజ్, అంచనాలు ఉండేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘మనం’ మూవీ క్లైమాక్స్ లో చిన్న గెస్ట్ రోల్ లో కనిపించిన అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ ని చూసి, రాబోయే కాలంలో, కాబోయే సూపర్ స్టార్ అవుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ మొత్తం తలకిందులైంది. భారీ అంచనాలతో విడుదల అవ్వడం వల్ల ఓపెనింగ్స్ అయితే చాలా బలంగా వచ్చాయి కానీ, ఫుల్ రన్ లో మాత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమాకి హీరో నితిన్(Hero Nithin) నిర్మాతగా వ్యవహరించాడు అనే విషయం మీకు గుర్తుందో లేదో..అంతే కాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) ముఖ్య అతిథి గా కూడా పాల్గొన్నాడు.

Also Read : పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్క్రీన్ నేమ్ టైటిల్ తో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా..మండిపడుతున్న ఫ్యాన్స్!

ఈ సినిమా హిట్ అయ్యుంటే అఖిల్ లెవెల్ వేరే రేంజ్ లో ఉండేది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ చిత్రం ఫలితం పై ప్రముఖ రచయత కోన వెంకట్(Kona Venkat) రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘అఖిల్ కథ తో సినిమా చేయొద్దని నేను వినాయక్ కి చాలా నచ్చచెప్పి చూసాను. ఆ కథతో సినిమా తీస్తే కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవుతుందని, ఇది వర్కౌట్ అయ్యే కథ కాదని చెప్పాను. కానీ ఆయన వినలేదు. నేను చెప్తే వినట్లేదని, వినాయక్ కి బాగా దగ్గరైన స్నేహితులతో చెప్పించి చూసాను. కానీ ఆయన తగ్గలేదు. నన్ను నమ్మండి ఈ సినిమా కచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని నమ్మాడు. నేను డిజాస్టర్ అవుతుందని బలంగా నమ్మాను. అయితే నేను ఒక విషయాన్ని నా జీవిత అనుభవం లో బలంగా నమ్ముతాను’.

‘ఒక సినిమా హిట్ అవుతుందంటే ముందు కథని చాలా బలంగా నమ్మాలి, కానీ గుడ్డిగా మాత్రం నమ్మకూడదు. వినాయక్ ‘అఖిల్’ కథని గుడ్డిగా నమ్మాడు కాబట్టే, ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అతనితో నాకు ఎలాంటి విబేధాలు లేవు, ఉన్న వాస్తవాలను చెప్తున్నాను. నా మనసుకి బాగా దగ్గరైన మనుషుల్లో ఒకడు వినాయక్. రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటాము. ప్రస్తుతం ఒక స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. త్వరలోనే ఆయన చాలా బలమైన కం బ్యాక్ ఇస్తాడని నమ్ముతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఏ ముహూర్తం లో అఖిల్ ఆ సినిమా చేసాడో కానీ, అప్పటి నుండి దుదృష్టం ఆయన వెంటే నడుస్తూ వస్తుంది. ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపుగా పదేళ్లు అయ్యింది. నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) ఏమో మంచి నీళ్లు తాగినంత తేలికగా సూపర్ హిట్స్ కొడుతున్నాడు, కానీ అఖిల్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క హిట్ ని కూడా అందుకోలేకపోయాడు. భవిష్యత్తులో అయినా అందుకుంటాడా అంటే అనుమానమే.

Also Read: కమల్ హాసన్ చేతిలో అల్లు అర్జున్ కవర్ ఫోటో..ఆయన సినిమాలో 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular