Mohammad Amir statement on India: శుభం కోరవయా పెళ్ళికొడుకా అంటే.. మా అత్త ఐరెండ్ల వద్దే ముండ మోయాలి అన్నాడట.. సరిగ్గా ఈ సామెత తీరుగానే ఉంది పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ అమీర్ వ్యవహారం.
సూపర్ 8 లో అద్భుతమైన కం బ్యాక్ ద్వారా టీమ్ ఇండియా సెమి ఫైనల్లోకి ప్రవేశించింది. ముంబై వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో సెమీఫైనల్ ఆడబోతోంది. ఇప్పటికే టీమ్ ఇండియా ప్లేయర్లు ముంబై చేరుకున్నారు. అక్కడ సాధన చేస్తున్నారు. ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా మైదానంలో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. 2022 సీజన్లో సెమీఫైనల్ లో టీమ్ ఇండియాను ఇంగ్లాండ్ ఓడించింది. 2024 సీజన్లో టీమ్ ఇండియా ఇంగ్లాండ్ జట్టును ఓడించింది. 2024లో ఫైనల్ లో దక్షిణాఫ్రికా ఓడించి టీమ్ ఇండియా విజేతగా నిలిచింది. రెండు జట్లలో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. వీరంతా విధ్వంసానికి పరాకాష్టగా ఆడతారు.
టీమ్ ఇండియా సెమి ఫైనల్ వెళ్లడాన్ని పాకిస్థాన్ ప్లేయర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ బౌలర్ అమీర్ భారత్ మీద తన విషాన్ని కక్కుతూనే ఉన్నాడు. సూపర్ 8 లో వెస్టిండీస్ జట్టుతో జరిగే మ్యాచ్లో టీమిండియా ఓడిపోతుందని జోస్యం చెప్పాడు. టీమ్ ఇండియా గెలవడంతో అమీర్ సోషల్ మీడియా వేదికగా నవ్వుల పాలయ్యాడు. ఇప్పుడు దాన్ని మర్చిపోకముందే టీమ్ ఇండియా మీద మరో విద్వేషమైన వ్యాఖ్యలు చేశాడు.
Also Read: ఆకాశంలో చంద్ర గ్రహణం.. టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ ను పక్కన పెట్టి ఏం చేశారంటే?
టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ వెళ్లదట. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతుందట. “ఇండియా సెమిస్ వెళ్ళదని చెప్పావు కదా.. ఇప్పుడు నువ్వే మళ్ళీ ఫైనల్ వెళ్ళదంటున్నావ్.. ఇలాంటప్పుడు నీ మాటలు ఎలా నమ్మాలని” ఓ వ్యక్తి ప్రశ్నించగా.. ” నేను ఇండియా సెమి ఫైనల్ వెళ్ళదని చెప్పాను. కానీ సూపర్ 8 మ్యాచ్ సంజు శాంసన్ అద్భుతంగా ఆడాడు. అందువల్ల టీమిండియా విజయం సాధించింది. వెస్టిండీస్ జట్టుతో అద్భుతంగా పోరాడే గెలిచింది. ఇండియా జట్టులో ఉన్న ప్లేయర్లు కంప్లీట్ క్రికెట్ ఆడలేదు. బుమ్రా మినహా మిగతా బౌలర్లు అంతగా ఫామ్ లో లేరు. బ్యాటింగ్లో కూడా ఒకరిద్దరు తప్ప.. మిగతా వారంతా విఫలమవుతున్నారు. అలాంటప్పుడు ఆ జట్టు ఇంగ్లాండ్ ను ఎలా ఓడిస్తుందని” అమీర్ ప్రశ్నించాడు.
అమీర్ చేసిన వ్యాఖ్యల పట్ల టీమిండియా అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ప్లేయర్ ది నోరు కాదని.. అది మురుగునీరుపారే మోరీ అని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అమీర్ టీమిండియా పట్ల తన చంచలమైన వైఖరిని మానుకోవాలని సూచిస్తున్నారు.