Allu Arjun financial help to Pavala Shyamala: క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వందల సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి పావలా శ్యామల. అయితే చాలా కాలం నుండి ఆమె ఆర్ధిక పరిస్థితి అసలు ఏ మాత్రం బాగోలేదు. అంతే కాకుండా పాపం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా బాగా క్షీణించింది. పూట కూడా గడవని పరిస్థితి ఏర్పడడంతో గతంలో పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ వంటి వారు ఆమెకు ఆర్ధిక సాయం అందించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆమెకు అనేక సార్లు సహాయం చేశారు. ప్రస్తుతం ఆమె సికింద్రాబాద్ లోని ఆర్కే ఫౌండేషన్ లో తన కుమార్తె కలిసి ఉంటున్నారు. వీళ్లిద్దరి ఆరోగ్య పరిస్థితి , ఆర్థిక స్తొమత ఏ మాత్రం బాగోలేదు. వీళ్లకు కనీసం మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఈమె దయనీయమైన పరిస్థితి ని తెలుసుకున్న అల్లు అర్జున్ ఆమెకు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు.
ఎంతో కొంత ఆర్ధిక సాయం చేసేలా కాకుండా, ప్రతీ నెల పావలా శ్యామల మరియు ఆమె కూతురుకి అయ్యే వైద్యం ఖర్చులను తీరుస్తూ, నెలకు 10 వేల రూపాయిలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వీళ్లిద్దరు జీవించి ఉన్నన్ని రోజులు అల్లు అర్జున్ ప్రతీ నెల 10 వేల రూపాయిల డబ్బు తన టీం ద్వారా పంపుతాడట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ పై నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి నిస్సహాయత తో ఉన్న వృద్ధులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది , మూవీ ఆర్టిస్టు అస్సోసియేషన్ ది, వాళ్ళెవ్వరు కూడా ఈమెని పట్టించుకోలేదు, కానీ అల్లు అర్జున్ పెద్ద మనసు చేసుకొని ఆమెకు జీవితాంతం అండగా ఉంటానని మాట ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. అల్లు అర్జున్ ఇలా స్వచ్ఛమైన మనస్సుతో ముందుకు రావడం వల్ల , రాబోయే రోజుల్లో పావలా శ్యామల కి మరికొంత మంది సినీ సెలబ్రిటీలు అండగా నిలబడే అవకాశాలు ఉన్నాయి.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి పెద్ద చిక్కుముడి వీడినట్టే..ఇక పాజిటివ్ టాక్ రావడమే బ్యాలన్స్!
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే అట్లీ మూవీ తో చేస్తున్న షూటింగ్ ని తాత్కాలికంగా ఆపేయాల్సి వచ్చింది. కారణం ఈ నెల 6న ఆయన సోదరుడు అల్లు శిరీష్ పెళ్లి జరగబోతుంది. అందుకే షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చింది. ఈ పెళ్లి తర్వాత మళ్లీ షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతుంది. జూన్ నెలలోపు షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి , లోకేష్ కనకరాజ్ తో చేయబోయే సినిమాకు షిఫ్ట్ అవ్వబోతున్నారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ నెలలో అట్లీ మూవీ కి సంబంధించిన టీజర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.