Homeక్రీడలుక్రికెట్‌MI vs KKR : మరికొద్ది క్షణాల్లో మ్యాచ్.. MI ఆ అద్భుతం చేస్తుందా?

MI vs KKR : మరికొద్ది క్షణాల్లో మ్యాచ్.. MI ఆ అద్భుతం చేస్తుందా?

MI vs KKR : ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్(Mumbai Indians) కు పేరుంది. ఈ జట్టు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది. అత్యంత సమర్థవంతమైన ఆటగాళ్లతో అలరారుతోంది. అయితే గత మూడు సీజన్లుగా ముంబై జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. గత సీజన్లో గ్రూప్ దశనుంచే ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది. గత సీజన్లో హార్దిక్ పాండ్యా(Hardik Pandya) ముంబై జట్టుకు కొత్త కెప్టెన్ గా వచ్చాడు. అయినప్పటికీ జట్టు లో ఏ మాత్రం పురోగతి లభించలేదు. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు ముంబై జట్టు వరుసగా రెండు మ్యాచ్లలో ఓటమిపాలైంది.. చెన్నై సూపర్ కింగ్స్(Chennai super kings) ఆడిన మ్యాచ్లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్.. ఆ తదుపరి గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలయింది. ఇక కోల్ కతా జట్టు తొలి మ్యాచ్ లో బెంగళూరు(Royal challengers Bangalore) చేతిలో ఓడిపోయింది. ఆ తదుపరి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan royals) జట్టుతో గెలిచింది. అయితే ఈ విజయపరంపరను కొనసాగించాలని కోల్ కతా(Kolkata knight riders) జట్టు భావిస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్(Mumbai Indians) కు సోమవారం కోల్ కతా జట్టు(Kolkata knight riders) తో జరిగే మ్యాచ్ అత్యంత ముఖ్యమైనది.

Also Read : బౌలింగ్ మొదలుపెట్టిన బుమ్రా.. MI లో ఎంట్రీ అప్పుడే.

ఆ ట్రెండు కొనసాగిస్తుందా.

ముంబై ఇండియన్స్(Mumbai Indians) కు ఇప్పుడు విజయం అత్యంత అవసరం..కోల్ కతా జట్టు(Kolkata knight riders) తో జరిగే మ్యాచ్ లో గెలుపొందాలని ముంబై ఇండియన్స్(Mumbai Indians) భావిస్తోంది. ముంబై ఇండియన్స్ కు ముంబై లోని వాంఖడే స్టేడియం సొంత మైదానంగా ఉంది. సొంత ప్రేక్షకుల సపోర్ట్ కూడా ఉంది. గతంలో ముంబై జట్టు పలు సందర్భాల్లో వరుసగా ఐదు మ్యాచ్లు ఓడిపోయి.. ఆ తర్వాత పుంజుకుంది. ట్రోఫీలు కూడా గెలుచుకుంది. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై జట్టు ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్లలో వరుసగా ఓడిపోయింది. అయితే సోమవారం కోల్ కతా జట్టుతో జరిగే మ్యాచ్లో గెలిచి.. విజయాల బాట పడుతుందని ముంబై ఇండియన్స్ అభిమానులు అంచనా వేస్తున్నారు..” గతంలో అనేక సందర్భాల్లో ఇలానే జరిగింది. పడి లేచిన కెరటం లాగా ముంబై జట్టు బౌన్స్ బ్యాక్ అయింది. అనేక విజయాలు సాధించి విజేతగా నిలిచింది. బలమైన జట్లను ఓడించి ఐపీఎల్ లో విజేతగా నిలిచింది.. అందువల్లే ముంబై ఇండియన్స్ పై మాకు నమ్మకం ఉంది.. ముంబై జట్టులో బలమైన ఆటగాళ్లు ఉన్నారు. సొంత మైదానంలో అదరగొడతారని నమ్మకం ఉందని” ముంబై ఇండియన్స్ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular