Baby Movie Heroine : యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సోషల్ మీడియా ఆడియన్స్ కి బాగా దగ్గరైన బ్యూటీ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya). ఈమె ‘బేబీ'(Baby Movie) సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసి ఏ రేంజ్ సునామీ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్ నుండి సిల్వర్ స్క్రీన్ కి వెళ్లి సక్సెస్ అయిన ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీస్ లో ఒకరు వైష్ణవి చైతన్య. ఇప్పటి వరకు ఈమె హీరోయిన్ గా చేసిన సినిమాలు రెండు విడుదల అయ్యాయి. బేబీ తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన ‘లవ్ మీ..ఈఫ్ యు డేర్’ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. అయినప్పటికీ కూడా ఈమెకు అవకాశాలు, డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఏకంగా డీజే టిల్లు హీరో సిద్దు జోనల్లగడ్డతో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది.
Also Read : ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కన్నుమూత..శోకసంద్రంలో సినీ పరిశ్రమ!
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో సిద్ధూ జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరో గా నటిస్తున్న ‘జాక్'(Jack Movie) చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్, పాట విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఈ రెండు వీడియోలను చూసిన తర్వాత వైష్ణవి కి మరోసారి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికినట్టు తెలుస్తుంది. వచ్చే నెల 10 న విడుదల కాబోతున్న ఈ సినిమా, వైష్ణవి చైతన్య ని మరో లెవెల్ కి తీసుకెళ్తుందా లేదా అనేది చూడాలి. ఇదంతా పక్కన పెడితే దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి అని పెద్దలు అంటూ ఉంటారు. ఆ సిద్ధాంతాన్ని వైష్ణవి చైతన్య చాలా గట్టిగా అనుసరిస్తుంది. హీరోయిన్ కెరీర్ కాలం మహా ఐటీ ఐదేళ్లు, లేదంటే పదేళ్లు. ఆ తర్వాత కొత్త హీరోయిన్స్ వస్తారు, ప్రస్తుతం టాప్ లో ఉన్న హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అయిపోతుంటారు. మొదటి నుండి సినీ ఇండస్ట్రీ లో ఇదే జరుగుతుంది.
అందుకే వైష్ణవి కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే డబ్బులు బాగా సంపాదించాలనే లక్ష్యం పెట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు కోటి రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ని అందుకుంటుందట. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ వచ్చిన ఒక అమ్మాయికి ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకుంటుంది అంటే కచ్చితంగా అభినందించ దగ్గ విషయమే. జాక్ సినిమా సూపర్ హిట్ అయితే ఈ అమ్మాయి రెమ్యూనరేషన్ ని మరింత పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. యూట్యూబ్ లో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా చేస్తూ వచ్చిన వైష్ణవి చైతన్య కు, ‘ది సాఫ్ట్ వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తో ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇదే వెబ్ సిరీస్ లో హీరోగా చేసిన షణ్ముఖ్ జస్వంత్ ఇప్పటికీ యూట్యూబర్ గానే మిగిలిపోతే, వైష్ణవి చైతన్య టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోతుండడం విశేషం.
Also Read : ‘జయం’ సినిమాలో హీరోయిన్ గా యాంకర్ రష్మీ..కానీ చివరికి ఏమైందంటే!