Jaspreet Bumrah : ముంబై జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో ఓటమిపాలైంది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది.. గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన రెండో మ్యాచ్ లోనూ ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. ఇక సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్(Mi vs KKR) తల పడుతున్నాయి.. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. మరోవైపు విజయాల పరంపర కొనసాగించాలని కోల్ కతా(Kolkata knight riders) యోచిస్తోంది. ఐపీఎల్ 18వ ఎడిషన్ లో తొలి మ్యాచ్లో బెంగళూరు చేతిలో కోల్ కతా నైట్ రైడర్స్ ఓటమిపాలైంది.. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్(Rajasthan royals) జట్టుతో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. ఇక ముంబై జట్టుకు ఈ సీజన్లో విజయం అత్యంత అవసరం. ప్రస్తుతం ముంబై జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. ముంబై జట్టు బౌలింగ్లో అత్యంత బలహీనంగా కనిపిస్తోంది.. అయితే ఇప్పుడు ఆ జట్టుకు ఒక గుడ్ న్యూస్ అందింది.
Also Read : పాసుల కోసం SRHను వేధించిన HCA: సీఎం సీరియస్ చర్యలు
ప్రాక్టీస్ మొదలుపెట్టాడు
ముంబై జట్టులో కీలక బౌలర్ గా ఉన్న బుమ్రా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. వెన్ను నొప్పి వల్ల ఐపిఎల్ కు బుమ్రా ఇన్ని రోజులపాటు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వెన్నునొప్పి తిరగబెట్టడంతో బుమ్రా చాలా రోజులపాటు నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతడు బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ నెట్స్ లో అతడు సాధన ప్రారంభించాడు. బౌలింగ్ చేస్తున్న అతడు తన పూర్వపు లయలోనే బంతులు విసిరాడు. గాయం నుంచి అతడు గనుక కోలుకొని త్వరలో ముంబై ఇండియన్స్ జట్టులో చేరితే బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ వంటి వారితో బౌలింగ్ దళం పటిష్టంగా మారుతుందని ముంబై ఇండియన్ అభిమానులు అంచనా వేస్తున్నారు. ” బుమ్రా ప్రాక్టీస్ చేయడం మంచి పరిణామం. అతడు త్వరగా కోలుకోవాలి. అతడు గనుక జట్టులోకి వస్తే బౌలింగ్ బలం పెంచుకుంటుంది. తద్వారా ప్రతి జట్లపై ముంబై ఇండియన్స్ పై చేయి సాధిస్తుంది. అతడు వెన్నునొప్పిని జయించాలని కోరుతున్నామని” ముంబై ఇండియన్స్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఇటీవల బుమ్రాను ఫిజియోథెరపిస్టులు పరిశీలించారు. అతడు వేగంగా కోలుకోవడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. త్వరలో అతడు తన పూర్వపుఫాం అందుకుంటాడని.. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ వెన్నునొప్పి పునరావృతం కాకుండా ఉంటుందని చెబుతున్నారు. బుమ్రా బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ముంబై ఆటగాళ్లకు కూడా ఆనందాన్ని కలిగిస్తోంది.
Also Read : 250+ స్కోర్ చేయకపోతే ట్రోల్స్ తప్పవా.. భారీ అంచనాలే SRH కొంప ముంచాయా?
View this post on Instagram