Today 20 December 2025 Horoscope: జ్యోతిష శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారులకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనుంది. ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తి చేయడంతో కోటి వారి సహాయం తీసుకుంటారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల మద్దతు ఉండడంతో విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొని విజయం సాధిస్తారు. ఉద్యోగులకు తోటి వారి సహకారం లభిస్తుంది. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభకార్తలు వింటారు. విహారయాత్రలు చేయాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారపరంగా అన్ని రకాలుగా లాభాలు ఉంటాయి. కొన్ని పనులు సకాలంలో పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు. కొత్త ఇల్లు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు ఉంటాయి. ఉద్యోగులు సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసాలు పొందుతారు. విద్యార్థులు భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . మీ రాశి వారు అనుకున్న కోరికలు ఈరోజు నెరవేరుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. తోటి వారి నుంచి ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు లభించడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారికి అన్ని రంగాల్లో కలిసి వస్తుంది. కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే పెద్దలను సంప్రదించాలి. రాజకీయ నాయకులకు సమాజంలో గౌరవం లభించడంతో ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపారులు లాభాలను పొందుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. విహార యాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . మీ రాశి వారు విదేశాలకు వెళ్లాలని అనుకుంటే అందుకు సంబంధించిన ప్లాన్ వేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించడానికి కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండడంతో మనశ్శాంతి లోపిస్తుంది. అయితే కొన్ని విషయాల్లో మౌనంగా ఉండటమే మంచిది. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : మీ రాశి వారి జీవితం ఈరోజు సంతోషకరంగా సాగుతుంది. ఉద్యోగుల కు జూనియర్ల నుంచి సహకారం అందడంతో ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కొత్త ఉద్యోగం గురించి చర్చిస్తారు. వ్యాపారులు కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఇవి భవిష్యత్తులో ప్రయోజనాలను తీసుకొస్తాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. అర్హులైన వారికి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి కెరీర్ విషయంలో ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంటారు. అధికారుల నుంచి మద్దతు ఉండడంతో ఉద్యోగులు కొన్ని పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది. ఇతరులకు ధన సహాయం చేస్తారు. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులకు కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆటంకాల సృష్టించే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి. కొందరు రహస్యంగా పనులకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొన్ని పనుల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. చేసే ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ఇతరుల సలహా తీసుకుంటారు. వ్యాపారానికి సంబంధించిన లాభాలు రాకపోవచ్చు. అయితే తోటి వారి సహాయం అందుతుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఇతరులతో విభేదాలను ఎదుర్కొంటారు. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విలాసాల కోసం ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఆర్థికంగా నష్టపోతారు. కొత్త స్నేహితులను పరిచయం చేసుకుంటారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. కొన్ని విషయాల్లో శుభవార్తలు వింటారు.