Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌పై గూస్‌బంప్స్ వీడియో.. చూస్తే దబిడి దిబిడే…

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తే చూడడానికి యావత్ తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Written By: NARESH, Updated On : June 8, 2024 10:01 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan : ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ మీద మనదేశ ప్రధాన మంత్రి అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు సైతం ప్రశంసల వర్షం కురిపించాడు. మోడీ గారు మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ పవన్ కాదు ఆయన ఒక తుఫాన్” అంటూ ఆయన మీద ప్రశంసలు కురిపించడంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ దేశం వ్యాప్తంగా చాలా పాపులారిటీని సంపాదించుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇంతకుముందు హిందూ ఆలయాల మీద జరిగిన దాడులను ఉద్దేశిస్తూ ఇక ట్వీట్ చేశారు. “సనాతన ధర్మం తో నడుస్తున్న ఈ దేశం లో హద్దులు మీరి ప్రవర్తిస్తే మీ తలకాయల మీద కాలు వేసి తొక్కుతాం” అంటూ తను ఇచ్చిన మాస్ వార్నింగ్ వీడియో అలాగే నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ను మెచ్చుకున్న వీడియోకి జత చేసి పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అంటూ జనసేన కార్యకర్తలు ఆయన అభిమానులు ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇక మరి కొంతమంది పవన్ అభిమానులైతే ఈ వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అంటూ కామెంట్లు చేయడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది.

ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించకపోయిన, 2024 లో జరిగిన ఈ ఎలక్షన్లలో మాత్రం తను ఒక గేమ్ చేంజర్ గా మారాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మొత్తానికైతే పవర్ స్టార్ అంటే ఏంటో చూపిస్తూ ముందుకు సాగడమే కాకుండా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తను అండగా ఉంటానని కూడా ఆయన పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఇక ఈనెల 12వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తే చూడడానికి యావత్ తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ఇక దాంతో పాటుగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నాడు. కాబట్టి ఇక మీదట నుంచి అసెంబ్లీలో సభలు మామూలుగా ఉండవు. పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరిని ఏకి పారేస్తాడు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఇప్పుడు ఏపీ పొలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ హవా కొనసాగుతుందనే చెప్పాలి…