Ruthuraj Gaekwad : రుతురాజ్ బ్రో.. నీ గ్రహచారం బాగాలేదు.. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి..

Ruthuraj Gaekwad నీ గ్రహచారం బాగాలేదు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలని" రుతు రాజ్ ను ఉద్దేశించి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : June 8, 2024 10:05 pm

Maharashtra Premier League

Follow us on

Ruthuraj Gaekwad : రాసిపెట్టి లేకుంటే.. కాశికి పోయినా ఉపయోగం ఉండదట.. ఈ సామెత ప్రస్తుతం టీమిండియా యువ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. టి20 క్రికెట్ చరిత్రలో ఎవరూ ఔట్ కాని రీతిలో రన్ అవుట్ అయ్యాడు.. అతడు అవుట్ అయిన విధానం చూసిన తర్వాత.. ఇలా కూడా రన్ అవుట్ అవుతారా? అని సగటు ప్రేక్షకుడికి అనిపిస్తోంది.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన చాలామంది.. రుతు రాజ్ గైక్వాడ్ పై సానుభూతి చూపిస్తున్నారు.

ఐపీఎల్ ముగిసిన తర్వాత.. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ సాగుతోంది. ఈ లీగ్ లో పుణేరి బప్పా జట్టుకు రుతు రాజ్ గైక్వాడ్ సారథ్యం వహిస్తున్నాడు. లీగ్ లో భాగంగా శుక్రవారం రత్నగిరి జెట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రుతు రాజ్ దారుణంగా అవుట్ అయ్యాడు. ఎవరూ ఊహించని విధంగా అవుట్ అయ్యి, పెవిలియన్ చేరుకున్నాడు. ఈ మ్యాచ్లో రుతు రాజ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 15 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ సహాయంతో 29 పరుగులు చేశాడు.. అయితే లాంగ్ ఆన్ లో ఆడిన ఒక షాట్ కు క్విక్ డబుల్ తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అనుకోకుండా రన్ అవుట్ అయ్యాడు.. పూణే ఇన్నింగ్స్ 12 ఓవర్లో తొలి బంతిని లాంగ్ ఆన్ లోకి రుతు రాజ్ డబుల్ రన్ కోసం పరుగులు పెట్టాడు.. రెండవ రన్ విజయవంతంగా పూర్తి చేసే విధంగా కనిపించాడు. ఈ దశలో అతడి బ్యాట్ అనూహ్యంగా క్రీజ్ లైన్ ముందు స్ట్రక్ అయింది. చేతిలో నుంచి జారిపోయింది. అప్పటికే బంతి అందుకున్న వికెట్ కీపర్ స్టంప్స్ ను గిరాటేశాడు.

ఈ పరిణామంతో రుతు రాజ్ ఒక్కసారిగా నిర్ఘాంత పోయాడు.. వాస్తవానికి అతడి చేతిలో బ్యాట్ జారిపోకుండా ఉంటే అవుట్ అయ్యేవాడు కాదు. అతడి అవుట్ నిరాశపరిస్తే.. ఈ మ్యాచ్లో పూణే టీం 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పూణే టీం 19.5 ఓవర్లలో 144 రన్స్ చేసి ఆల్ అవుట్ అయింది. అనంతరం 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రత్నగిరి జట్టు, 19.4 ఓవర్లలో ఆర్ వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది. కాగా, ఈ మ్యాచ్లో రుతు రాజ్ ఔట్ అయిన విధానం పట్ల సోషల్ మీడియాలో కామెంట్స్ పేలిపోతున్నాయి..” నీ గ్రహచారం బాగాలేదు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలని” రుతు రాజ్ ను ఉద్దేశించి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.