spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: క్యాబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. కారణం ఏంటంటే..

Pawan Kalyan: క్యాబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. కారణం ఏంటంటే..

Pawan Kalyan: సచివాలయం లో నేడు సీఎం చంద్రబాబు నాయుడు అద్వర్యం లో జరిగిన క్యాబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు అవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం గా మారింది. ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే సమయం లో , డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి రాకపోవడం బహుశా ఏ రాష్ట్రము లో జరగదేమో అంటూ ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. గత క్యాబినేట్ సమావేశాలకు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోయారని, ఇప్పుడు కూడా అదే జరగడం చూస్తుంటే , సీఎం చంద్రబాబు పాలన పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు పవన్ కళ్యాణ్ కి అసలు నచ్చడం లేదేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెండు సార్లు మాత్రమే కాకుండా, గతంలో కూడా పవన్ కళ్యాణ్ క్యాబినెట్ సమావేశాలకు హాజరు కాలేకపోయారు.

రెండు మూడు క్యాబినెట్ సమావేశాల్లో ఆయన మధ్యలోనే లేచి వెళ్ళిపోయినట్టు వార్తలు వినిపించాయి. అయితే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా జరిగిన ఈ రెండు క్యాబినెట్ సమావేశాలకు హాజరు కాకపోవడానికి గల ముఖ్య కారణం ఆయన భుజాలకు సర్జరీ చేయడం వల్లే. గత క్యాబినెట్ సమావేశం జరుగుతున్నప్పుడు ఆయన ముంబై లో శస్త్ర చికిత్స చేయించుకుంటున్నారు, ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్రాంతి అంటున్నారు, మరి నేడు అమరావతి కి తీసుకొచ్చిన కుంకీ ఏనుగుల స్వాగతం కార్యక్రమానికి ఎలా వచ్చారు? అనే సందేహం మీలో కలగొచ్చు. అది కేవలం 30 నిమిషాల కార్యక్రమం మాత్రమే. కానీ క్యాబినెట్ సమావేశాలు గంటల తరబడి ఉంటాయి. అలాంటి సమావేశాల్లో పవన్ కళ్యాణ్ హాజరు కాకూడదని డాక్టర్లు స్వయంగా తెలిపారు. కేవలం క్యాబినెట్ సమావేశాలకు మాత్రమే కాదు , నేడు విజయవాడ లో జరగనున్న ‘జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం’ కార్యక్రమానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదు.

మరో రెండు వారాలు ఆయన ఒత్తిడికి గురయ్యే ఏ కార్యక్రమం లో కూడా పాల్గొనబోవడం లేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం పర్యటించాల్సి ఉంది. అందుకు సంబంధించిన షెడ్యూల్స్ ని అధికారులు ఎప్పుడో డిజైన్ చేశారు. కానీ డాక్టర్లు క్షేత్ర స్థాయి లో ఒకవేళ పర్యటించి , అభిమానుల తాకిడి వల్ల ఏ చిన్న తేడా జరిగినా, గాయాలు ఇంతకు ముందుకంటే తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని , ఎడమ భుజం కూడా దెబ్బ తింటుందని హెచ్చరించడం తో వేరే తేదీలకు ఈ కార్యక్రమాన్ని రీ షెడ్యూల్ చేశారు. ఇకపోతే ఈ నెల 31 న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసం గా జరగనుంది , 3 లక్షల మంది జనాలు హాజరయ్యే ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అప్పటి లోపు పవన్ కళ్యాణ్ కోలుకుంటారా? , ఆ కార్యక్రమానికి హాజరు అవుతారా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...
Oktelugu Epaper
Exit mobile version