IPL : ఏ ముహూర్తంలో అయితే గుజరాత్ టైటాన్స్ పై టెర్రిబుల్ సెంచరీ చేశాడో.. అప్పటినుంచి రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ ఒక్కసారిగా నేషనల్ హీరో అయిపోయాడు. 14 సంవత్సరాల ప్రారంభంలోనే ఏ క్రికెటర్ కూడా సాధించలేని రికార్డును అధిగమించాడు. అనేక ఘనతలను తన పాదా క్రాంతం చేసుకున్నాడు. తద్వారా సరికొత్త ఆటగాడిగా ఆవిర్భవించాడు. ఐపీఎల్ చరిత్రలో 14 సంవత్సరాల వయసులోనే ఈ స్థాయిలో రికార్డును సాధించిన ఆటగాడు ఇప్పటివరకు ఎవరూ లేకపోవడం విశేషం. అయితే ఒకవేళ ఆ వయసులో ఐపీఎల్ లోకి ప్రవేశించినప్పటికీ.. “సూర్య” మాదిరిగా ఆడాలి అంటే చాలా కష్టం. అతడి దూకుడు.. అతడి ముందుచూపు.. అతడివేగం.. అతడి బలం మామూలుగా లేవు.. 1000 ఏనుగుల శక్తిని ఒక్కడే పొందినట్టు బ్యాటింగ్ చేస్తున్నాడు. అందువల్లే గుజరాత్ బౌలర్లు అతడికి సరెండర్ అయిపోయారు. ఇషాంత్ శర్మ, రషీద్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్.. ఇలా గొప్ప గొప్ప బౌలర్లు మొత్తం జస్ట్ ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. సూర్య వంశీ కొడుతుంటే చప్పట్లు కొట్టడం మినహా.. ఏమీ చేయలేకపోయారు.
Also Read : ఐపీఎల్ లో ప్లే ఆఫ్ వెళ్లే జట్లు ఇవే.. పది టీమ్ లకు అవకాశాలు ఎలా ఉన్నాయంటే..
మంత్రముగ్ధులయిపోయారు
గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ సిక్సర పిడుగు మాదిరిగా రెచ్చిపోయాడు. నిండా 15 సంవత్సరాలు లేని కుర్రాడు ఈ స్థాయిలో ఆడటంతో మ్యాచ్ చూస్తున్న అభిమానులు, ప్రేక్షకులు మాత్రమే కాదు.. మైదానంలో డగ్ అవుట్ లో ఉన్న క్రికెట్ దిగ్గజాలు సైతం ఫిదా అయిపోయారు. అతడు ఆడుతుంటే చప్పట్లు కొట్టారు. చివరికి 101 పరుగులు చేసి అవుట్ అయ్యి.. తిరిగి పెవిలియన్ వస్తుంటే ఆటగాళ్లు మొత్తం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. రాహుల్ ద్రావిడ్ అయితే చప్పట్లు కొట్టి మరీ అభినందించాడు. భుజం తట్టి గట్టోడివి అంటూ ప్రోత్సహించాడు.. ఇక గుజరాత్ ఆటగాళ్లు ఒక్కొక్కరిగా అతని దగ్గరికి వచ్చి షేక్ అండ్ ఇచ్చారు. మర్చిపోలేని స్థాయిలో బ్యాటింగ్ చేశావ్ అంటూ కితాబిచ్చారు. చివరికి గుజరాత్ కెప్టెన్ గిల్ కూడా సూర్యవంశీ బ్యాటింగ్ చూసి స్టాచ్యూ అయిపోయాడు. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. అతడు వైభవ్ సూర్యవంశీ ఆట గురించి పదేపదే ప్రస్తావించడం విశేషం. ఇక రవి శాస్త్రి లాంటి దిగ్గజ ఆటగాడు అయితే వైభవ్ సూర్య వంశీ ఇన్నింగ్స్ ను డైనమేట్ తో పోల్చడం గమనార్హం. 15 ఏళ్లు కూడా నిండని వయసులో చిచ్చరపిడుగు మాదిరిగా బ్యాటింగ్ చేసిన వైభవ్ సూర్య వంశీ.. అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. అంతేకాదు 18 ఏళ్ల సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో 14 సంవత్సరాల ఆటగాడికి జట్టు ప్లేయర్లు, ప్రధాన కోచ్, కోచింగ్ స్టాఫ్, మైదానంలో ఉన్న అభిమానులు, ప్రేక్షకులు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం ఇదే తొలిసారి. స్టాండింగ్ ఓవేషన్ చూస్తున్నప్పటికీ.. వైభవ్ సూర్య వంశీ జస్ట్ సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అతని ముఖంలో ఏమాత్రం గర్వం.. కనిపించలేదు.
Also Read : విరాట్ కోహ్లీకి పాక్ క్రికెటర్లు అంటేనే ఇష్టమా..ఒరేయ్ మీకు ఉంటది రా..
#vaibhavsuryavanshi's knock made #RahulDravid stand up from the wheelchair#IPL2025 #VaibhavSuryavanshi #RRvsGT pic.twitter.com/cmlgdp1jv8
— Sachi (@sachi_gkp) April 29, 2025
