IPL 2025 Playoffs: పాయింట్ల పట్టికలో బెంగళూరు నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం బెంగళూరు జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. ఇప్పటివరకు పది మ్యాచ్లు ఆడిన బెంగళూరు.. ఏడు మ్యాచ్లలో అద్భుతమైన విజయాలు సాధించింది. బెంగళూరు +0.521 నెట్ రన్ రేట్ తో అద్భుతమైన స్థానంలో కొనసాగుతోంది. రెండవ స్థానంలో గుజరాత్ టైటాన్స్, థర్డ్ ప్లేస్ లో ముంబై ఇండియన్స్.. ఫోర్త్ ప్లేస్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. ఫిఫ్త్ ప్లేస్ లో పంజాబ్ జట్టు ఉంది. ఇక మిగతా స్థానాలలో ఇతర జట్లు కొనసాగుతున్నాయి.
Also Read: ఢిల్లీ పై బెంగళూరు గెలిచినా.. విరాట్ కోహ్లీని ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు.. ఎందుకిలా?
ప్లే ఆఫ్ వెళ్లే జట్లు ఇవే
ఐపీఎల్ లో గ్రూప్ దశలో తొలి నాలుగు జట్లకే ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ప్లే ఆఫ్ లో విజయం సాధించిన జట్లు ఫైనల్ లో పోటీ పడతాయి. ఫైనల్లో గెలిచిన జట్టు విజేతగా ఆవిర్భవిస్తుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ల ప్రకారం చూసుకుంటే ప్లే ఆఫ్ వెళ్లే నాలుగు జట్ల వివరాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో 90 శాతం అవకాశాలతో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. 87% అవకాశాలతో గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్లే ఆఫ్ వెళ్లడానికి 75% అవకాశం ఉంది. ముంబై ఇండియన్ జట్టు ప్లే ఆఫ్ లో ప్రవేశించడానికి 64% అవకాశం ఉంది. ఇక పంజాబ్ జట్టుకు 58, లక్నోకు 19, కోల్ కతా కు 6, రాజస్థాన్ రాయల్స్ 0.1, చెన్నై కి 0.03 శాతం అవకాశాలున్నాయి.
అద్భుతాలు జరుగుతున్నాయి
ఈ ఐపీఎల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ అద్భుతాలు చేస్తున్నాయి. ముంబై ఇండియన్స్ కూడా బౌన్స్ బ్యాక్ అయినట్టుగా ఆడుతున్నది. మేటిజట్లను ఓడించి.. సిసలైన ప్రదర్శన చేస్తోంది.. పంజాబ్ జట్టు కూడా అంచనాలకు మించి ఆడుతోంది. ఇటీవల ఓటములు ఎదురైనప్పటికీ.. మళ్లీ ఆ జట్టు పుంజుకునే అవకాశం కొట్టి పారేయలేనిది. లక్నో కు కూడా అవకాశాలు ముగుసుకు పోలేదు. కాకపోతే ఆ జట్టు సమష్టి ప్రదర్శన చేయలేకపోతోంది. కోల్ కతా జట్టు కూడా అంచనాలకు మించి రాణించలేకపోతోంది. హైదరాబాద్ జట్టు గత సీజన్లో ఫైనల్ వెళ్లినప్పటికీ.. ఈసారి ఆ తీరుగా ఆడలేక పోతోంది. హైదరాబాద్ లీగ్ దశలో ఇంకా ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ ఐదింట్లో కూడా వరుస విజయాలు సాధించాలి. అవి కూడా భారీ తేడాతో ఉండాలి. అప్పుడే హైదరాబాద్ జట్టుకు ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశాలుంటాయి. ఇక రాజస్థాన్ రాయల్స్, చెన్నైసూపర్ కింగ్స్ గ్రూప్ దశ నుంచే ఇంటికి వెళ్లిపోవడం ఖాయం అయినప్పటికీ.. అద్భుతాలకు మించి అద్భుతాలు జరిగితేనే ఆ జట్లు ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ ఐపీఎల్లో అండర్ డాగ్ జట్లు అదరగొడుతున్నాయి. గత సీజన్లో విఫల ప్రదర్శన చేసిన టీమ్ లు ఓ రేంజ్ లో ఆడుతున్నాయి. చూడాలి మరి వచ్చే రోజుల్లో ఏం జరుగుతుందో.. మొన్నటిదాకా పంజాబ్ జట్టు టాప్ స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఒక్కసారిగా ఐదవ స్థానానికి పడిపోయింది. అయితే ఇలాంటి పరిస్థితి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ కు ఎదురు కాదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఐపీఎల్ లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.
Also Read: విరాట్ కోహ్లీకి పాక్ క్రికెటర్లు అంటేనే ఇష్టమా..ఒరేయ్ మీకు ఉంటది రా..