Rajasaab Teaser : సినిమా పాటర్న్ మొత్తం మారిపోయింది. గత కొద్ది రోజుల నుంచి ఏ ఇండస్ట్రీ నుంచి సినిమా వచ్చినా కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు సైతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరిస్తూ ఉండడం విశేషం… ఇక ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి ప్రతి ప్రేక్షకుడు తనను తాను రిప్రజెంట్ చేస్తూ భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు… బాహుబలి (Bahubali) సినిమాతో తనకంటూ మంచి ఇమేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ (Prabhas) సైతం ప్రస్తుతం వరుస సినిమాలతో పాన్ ఇండియా సక్సెస్ లను సాధించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక మారుతి డైరెక్షన్ లో గత మూడు సంవత్సరాల కిందట మొదలుపెట్టిన రాజాసాబ్ సినిమా ఈ ఇయర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేస్తూ ఉండటం తమ అభిమానులతో పాటు ప్రేక్షకులను సైతం విసిగిస్తుందనే చెప్పాలి.
Also Read : రాజాసాబ్ లో ఈ ఒక్క ట్విస్ట్ చాలు సినిమా సక్సెస్ అవ్వడానికి…ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు లోడింగ్…
ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా తొందర్లోనే రాబోతుంది అంటూ సినిమా మీద హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన బజ్ అయితే తగ్గిపోయింది. ప్రేక్షకులు ఎవరు కూడా ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తి అయితే చూపించడం లేదు. ఒకవేళ టీజర్ వచ్చి బాగుంటే తప్ప ఈ సినిమాకి హైప్ అయితే క్రియేట్ అవ్వదు.
మరి ఇలాంటి సందర్భంలో మారుతి (Maruthi) లాంటి దర్శకుడు మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా కావడం వల్ల ఆయన ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించనప్పటికి టీజర్ ని రిలీజ్ చేసిన రోజే సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ టీజర్ మే నెలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read : రాజాసాబ్ మూవీలో అంత మేటర్ ఉందా? 10 ఏళ్ళు దాక మర్చిపోరట, హైప్ పెంచేసిన స్టార్ కమెడియన్