IPL 2025 Auction: ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి జరుగుతున్న వేలంలో ఇద్దరు ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిసింది. వారిద్దరూ వర్ధమాన ఆటగాళ్లు కావడం.. ఇటీవల కాలంలో అద్భుతమైన ప్రదర్శన చూపిస్తున్న నేపథ్యంలో వారిద్దరికి ఫ్రాంచైజీలు జాక్ పాట్ కల్పించాయి..
పండగ చేసుకున్నారు
ఐపీఎల్ 2025 లో ఎక్కువ పర్స్ వేల్యూ ఉన్న జట్లలో పంజాబ్ కొనసాగుతోంది. ఆ జట్టు వద్ద ఏకంగా 110 కోట్లు ఉన్నాయి. అయితే ఆ జట్టు ఇటీవల రిటైన్ జాబితాలో ఇద్దరు మినహా మిగతా ఆటగాళ్లను అంటి పెట్టుకోలేదు. అయితే ఆదివారం జరిగిన వేలంలో దక్షిణాఫ్రికా సంచలన బౌలర్ రబడాను పంజాబ్ కొనుగోలు చేసింది. అతని కనిస ధర రెండు కోట్లు ఉండగా, ఏకంగా 10.75 కోట్లు చెల్లించి పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా జట్టులో సంచలన బౌలర్ గా రబాడ కొనసాగుతున్నాడు. రబాడ 2017లో ఐపీఎల్ లో కి ఎంట్రీ ఇచ్చాడు.. ప్రతి సీజన్లోనూ ఆడుతున్నాడు. ఇప్పటివరకు 80 మ్యాచులు ఆడి, 117 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతడు పంజాబ్ జట్టుకే ఆడుతున్నాడు. అయితే ఇటీవల అతడిని పంజాబ్ జట్టు రిటైన్ చేసుకోలేదు. అయితే వేలంలో 10.75 కోట్లకు అతడిని పంజాబ్ కొనుగోలు చేసింది. 2020 సీజన్లో రబాడ 17 మ్యాచ్ లు ఆడి, 30 వికెట్లు పడగొట్టాడు.. ఇతడి అత్యుత్తమ ప్రదర్శన 4/24.
అత్యధిక ధర
మరో సంచలన బౌలర్ అర్ష్ దీప్ సింగ్ ను కూడా పంజాబ్ కొనుగోలు చేసింది. ఇతడి కనీస ధర రెండు కోట్లు. అయితే అతనికి ఏకంగా 18 కోట్లు చెల్లించి పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. అయితే ఇతడి కోసం చెన్నై, ఢిల్లీ జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. మధ్యలో గుజరాత్, బెంగళూరు, రాజస్థాన్ కూడా అతని కోసం బిడ్ వేశాయి. అయితే చివరికి పంజాబ్ జట్టు ఆర్టీఎం ద్వారా 18 కోట్లకు అర్ష్ దీప్ సింగ్ ను కొనుగోలు చేసింది. అయితే ఇటీవల కాలంలో భారత్ ఆడిన టి20 క్రికెట్ సిరీస్ లలో అర్ష్ దీప్ సింగ్ స్థిరంగా రాణిస్తున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్లో ఆరు వికెట్లు సొంతం చేసుకున్నాడు. టి20 క్రికెట్లో భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు సాధించిన రెండవ బౌలర్ గా కొనసాగుతున్నాడు. 2019లో అర్ష్ దీప్ సింగ్ ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడు పంజాబ్ జట్టు తరుపున ఆడుతున్నాడు. గత ఐదు సంవత్సరాలు ఆ జట్టు అతడిని అంటిపెట్టుకుంది. ఈ ఏడాది సీజన్లో రిలీజ్ చేసింది. అయినప్పటికీ వేలంలో భారీ పోటీ మధ్య, రైట్ టు మ్యాచ్ ద్వారా అతడిని 18 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఎక్కువ డబ్బులకు అమ్ముడుపోయిన ఆటగాడిగా అర్ష్ దీప్ సింగ్ రికార్డు సృష్టించాడు. గత కొద్ది సంవత్సరాలుగా అర్ష్ దీప్ సింగ్ స్థిరంగా రాణిస్తున్నాడు.. టీమిండియా విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.