https://oktelugu.com/

Vijay And Rashmika: మరోసారి అడ్డంగా దొరికిపోయిన విజయ్ -రష్మిక.. ఈసారి తప్పించుకోలేరు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్లీ కపుల్స్ ఎవరంటే విజయ్ దేవరకొండ- రష్మిక మందానా అని చెబుతూ ఉంటారు. గీత గోవిందం సినిమాలో ఈ జంట చూడముచ్చటగా ఉంటుంది. ఈసినిమా హిట్టు తరువాత మరోసారి కలిసి నటించారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 24, 2024 / 04:29 PM IST

    Vijay And Rashmika

    Follow us on

    Vijay And Rashmika: సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి గాసిప్స్ గుప్పుమంటాయి. అయితే వీటికి బలాన్ని చేకూర్చుతూ నటులు సైతం వివిధ ప్రదేశాల్లో కలుస్తూ ఫొటోలను రిలీజ్ చేస్తారు. వారు బయటపెట్టకపోయినా కొందరు ఈ విషయాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ సందడి చేస్తుంటారు. సినిమాల్లో నటించే స్లార్ల మధ్య అన్యోన్యత ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా రెండు మూడు సినిమాల్లో కలిసి నటించిన హీరో, హీరోయిన్ల మధ్య స్నేహం పెరిగి ఆ తరువాత ప్రేమలో పడడం కామన్. అయితే అంతకంటే ముందే వీరు కాఫీ షాపులోనో, హోటళ్లలో కలుస్తూ ఉంటారు. ఈ సమయంలో వీరి మధ్య ఏదో ఉందని కొందరు అడగగా అదేం లేదని అంటుంటారు. కానీ తరుచూ వీరు కలిసి కనిపించడం వల్ల వారి గురించి హాట్ టాపిక్ అవుతుంది. చివరకు అసలు విషయం చెబుతారునుకోండి.. ఇన్నాళ్లుగా ఓ జంట గురించి రకరకాలుగా అనుకుంటుండగా.. అదేం లేదని సమాధానం ఇచ్చారు. కానీ తాజాగా ఓ సినీ జంట మరోసారి ఓ హోటళ్లలో కలిశారు. దీంతో ఈసారి తప్పించుకోలేరు.. అంటూ సినీ ప్రేక్షకులు సందడి చేస్తున్నారు. ఇంతకీ ఆ జంట ఏదీ? అసలేం జరిగింది?

    టాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్లీ కపుల్స్ ఎవరంటే విజయ్ దేవరకొండ- రష్మిక మందానా అని చెబుతూ ఉంటారు. గీత గోవిందం సినిమాలో ఈ జంట చూడముచ్చటగా ఉంటుంది. ఈసినిమా హిట్టు తరువాత మరోసారి కలిసి నటించారు. అయితే ఆ తరువాత రష్మిక పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. అటు విజయ్ సైతం పూరి జగన్నాథ్ సినిమా ‘లైగర్’ తో బాలీవుడ్ లో గుర్తింపు పొందారు. అయితే విజయ్ దేవరకొండ- రష్మికలు కలిసి సినిమాల్లో నటించకపోయినా పలు యాడ్స్ లో కనిపించారు. అంతేకాకుండా వీరు తరుచూ హోటళ్లలో, ఇతర ప్రదేశాల్లో కనిపించారు.

    ఈ సమయంలో వారిని చూసిన ఫ్యాన్స్ ఊరుకుంటారా? వెంటనే ఫొటోలు, వీడియోలు తీసి అప్లోడ్ చేశారు. ఆ మధ్య ఓసారి ముంబై హోటళ్లలో ఈ జంట కలిసి కనిపించింది. దీంతో ప్రేమలో పడ్డారా? అని కొందరు అడిగేశారు. దీంతో రష్మిక స్పందిస్తూ ఓ యాడ్ షూటింగ్లో భాగంగా ఇక్కడికి వచ్చాం అని క్లారిటీ ఇచ్చింది. దీంతో కామ్ అయ్యారు. ఆ తరువాత ఓ సెలబ్రేషన్ లోనూ రష్మిక విజయ్ తో కనిపించింది. మళ్లీ అదే ప్రశ్న అడగ్గా.. తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది. అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చ మాత్రం ఆగలేదు. వీరి మధ్య ఏదో ఉందంటూ తీవ్ర చర్చ సాగింది.

    కొన్ని రోజుల గ్యాప్ తరువాత ఈ కపుల్స్ మరోసారి ఓ హోటళ్లలో మెరిసింది. దీంతో కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అయితే ఇన్నాళ్లు మా మధ్య ఏం లేదని చెప్పినా రష్మికా అండ్ విజయ్ ఈసారి ఏం చెబుతారోనని అంటున్నారు. అంతేకాకుండా ఈసారి సమాధానం దాటవేడానికి వీలు లేదు.. అంటూ కొందరుక్యాప్షన్ కూడా పెడుతున్నారు. ఈ హోటళ్లలో ఓ డిష్ తో కనిపించిన రష్మిక కాస్త గ్లామర్ గానే కనిపిస్తుంది. అటు విజయ్ కూడా ప్రత్యేక గెటప్ లో ఉన్నారు. మరి ఈసారి యాడ్ కోసం కలిశారా? లేదా ఏదైనా సినిమా షూటింగ్ కోసమా? అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మిగతా వారు మాత్రం రెగ్యులర్ మీట్ లో భాగంగానే ఇక్కడ కలిశారు అని అంటున్నారు.