https://oktelugu.com/

Allu Arjun: ఎట్టకేలకు నంద్యాల ఘటనపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్..వాళ్ళు అర్థం చేసుకుంటే గొడవలు ఉండవ్ అంటూ కామెంట్స్!

అర్జున్ మామయ్య కూడా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ పై బహిరంగంగానే విమర్శలు చేయడం, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అల్లు అర్జున్ కి కౌంటర్లు ఇవ్వడం వంటివి జరిగాయి. ఈ గొడవలు ఇప్పటికీ ఆగలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : November 24, 2024 / 04:45 PM IST

    Allu Arjun(11)

    Follow us on

    Allu Arjun: సోషల్ మీడియా లో గత 6 నెలల నుండి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఎంత రచ్చ జరుగుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. అల్లు అర్జున్ జనసేన పార్టీ కి కాకుండా, తన మిత్రుడు, వైసీపీ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి కోసం ఎన్నికల ప్రచారం చివరి రోజున వెళ్లి కలిసి రావడం పెద్ద దుమారం రేపింది. అప్పుడు మొదలైన ఈ రచ్చ, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా పరోక్షంగా అల్లు అర్జున్ ని ఉద్దేశించి ట్వీట్ వేస్తూ తన అసంతృప్తిని వ్యక్తపరిచాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ మామయ్య కూడా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ పై బహిరంగంగానే విమర్శలు చేయడం, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అల్లు అర్జున్ కి కౌంటర్లు ఇవ్వడం వంటివి జరిగాయి. ఈ గొడవలు ఇప్పటికీ ఆగలేదు. సోషల్ మీడియా లో కొనసాగుతూనే ఉన్నాయి.

    అయితే ఈ ఇద్దరినీ సమానంగా అభిమానించే మెగా అభిమానులు మాత్రం, తొందరగా ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పడితే బాగుండును అని కోరుకుంటున్నారు. కానీ ఆ సందర్భాలు మాత్రం రావడం లేదు. రీసెంట్ గా అల్లు అర్జున్ ‘అన్ స్టాపబుల్ 4’ టాక్ షోలో పాల్గొన్నాడు. రెండు భాగాలుగా ఈయనకి సంబంధించిన ఎపిసోడ్ ని కట్ చేసి ఆహా యాప్ లో అప్లోడ్ చేసారు. మొదటి భాగంలో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ‘ఆయనలోని ధైర్యం నాకు చాలా ఇష్టం. ఎలాంటి సందర్భం ఎదురైనా, ముందు వెనుక చూసుకోకుండా వెళ్లిపోతుంటారు, మీలాగే’ అని అంటాడు. దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతవరకు సంతృప్తి చెందారు కానీ, పూర్తి స్థాయిలో మాత్రం కాదు. ఇవ్వాల్సిన విషయాల్లో క్లారిటీ ఇవ్వలేదు అని అసంతృప్తి వ్యక్తం చేసారు అభిమానులు. కానీ రెండవ భాగం లో మాత్రం కొంతవరకు క్లారిటీ ఇచ్చాడు.

    ఆయన మాట్లాడుతూ ‘నేను అందరినీ ఎంతో ఇష్టపడతాను. కానీ నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రం కాస్త భిన్నంగా ఉంటాయి. నేను ఈ ప్రపంచంలో నా తండ్రిని మించి ఎవ్వరినీ ప్రేమించలేదు. కానీ ఆయనతో కూడా నాకు కొన్ని విషయాల్లో అభిప్రాయం బేధాలు ఉంటాయి. అవి కేవలం అక్కడి వరకు ఉంచితేనే బాగుంటుంది. అలా కాకుండా వ్యక్తిగతంగా ఇష్టం లేనట్టు చూడకూడదు. రెండు వేర్వేరు అంశాలు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన నంద్యాల ఘటన గురించి నేరుగా అయితే మాట్లాడలేదు కానీ, పరోక్షంగా ఆ ఘటన మీద కూడా వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. అభిమానులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని సోషల్ మీడియా లో ఇలా గొడవలు పడడం ఆపేస్తే చాలా బాగుంటుంది అని అంటున్నారు మెగా అభిమానులు. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం వచ్చే నెల 5 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే.