Mohammed Siraj : పేద కుటుంబం నుంచి డీఎస్పీ దాకా.. భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ భావోద్వేగ ప్రయాణమిది..

కష్టపడ్డవాడు ఎప్పటికైనా విజేత అవుతాడు. కాకపోతే ఆ కష్టంలో క్వాలిటీ ఉండాలి. చేస్తాననే తపన ఉండాలి. దేన్నైనా ఎదుర్కొంటానని ధీరత్వం ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి విజయం సాధించగలడు. విజేతగా ఆవిర్భవించగలడు. ఇలాంటి ప్రయత్నం చేశాడు కాబట్టే టీమిండియా యువ బౌలర్ మహమ్మద్ సిరాజ్ విజేతగా ఆవిర్భవించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 13, 2024 7:59 pm

Mohammed Siraj

Follow us on

Mohammed Siraj :  మహమ్మద్ సిరాజ్ టీమిండియాలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు. అయితే అతను టీమిండియాకు ఎంపిక కావడం రాత్రికి రాత్రే జరిగిపోలేదు . దాని వెనుక నిద్రలేని రాత్రులు ఉన్నాయి. జేబులో పది రూపాయలు లేని కటిక పేదరికం ఉంది. ఆటో నడిపి మరీ.. నెట్స్ లో సాధన చేసిన రోజులూ ఉన్నాయి. కష్టేఫలి అన్నట్టు.. తీవ్రంగా కష్టపడి.. టీమిండియా కు ఎంపిక అయ్యాడు. తనను తాను నిరూపించుకున్నాడు. టీమిండియా సాధించిన విజయాలలో తన వంతు పాత్ర పోషించాడు. తిరుగులేని స్థాయిలో నిలబడ్డాడు. అందుకే ఈ రోజున లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం నుంచి డిఎస్పీ ఉద్యోగాన్ని సైతం పొందాడు. ప్రభుత్వం డిఎస్పీగా నియమించిన నేపథ్యంలో.. తెలంగాణ డిజిపి నుంచి ఉత్తర్వులు స్వీకరించి.. బాధ్యతలు చేపట్టాడు.. మహమ్మద్ సిరాజ్ పోలీస్ డ్రెస్ వేసుకొని.. చేతిలో లాఠీ పట్టుకున్న ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. టి20 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో మహమ్మద్ సిరాజ్ కీలక సభ్యుడు. టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహమ్మద్ సిరాజ్ కు గ్రూప్ -1 ఉద్యోగం కేటాయించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో 600 చదరపు గజాల స్థానాన్ని కేటాయించారు. డిజిపి డాక్టర్ జితేందర్ ను కలిసి సిరాజ్ జాయినింగ్ లెటర్ అందుకున్నారు. సిరాజ్ వెంట పోలీసు ఉన్నతాధికారులు మహమ్మద్ భగవత్, రమేష్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు ఉన్నారు.. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సిరాజ్ ను గ్రూప్ -1 అధికారిగా నియమించారు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 78 లో 6 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారు.

పేదరికం నుంచి ఈ స్థాయి దాకా..

నిరుపేద కుటుంబాన్ని నుంచి మహమ్మద్ సిరాజ్ ఎంతో కష్టపడి ఈ స్థాయి దాకా వచ్చారు. అప్పట్లో మహమ్మద్ సిరాజ్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. సిరాజ్ లాంటి ఆటగాళ్లను సన్మానించుకోవడం తెలంగాణ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అప్పట్లోనే ప్రభుత్వం ఆయనకు గ్రూప్ -1 స్థాయి ఉద్యోగం కేటాయించినప్పటికీ.. మహమ్మద్ సిరాజ్ బాధ్యతలను స్వీకరించలేదు. అయితే ప్రస్తుతం సిరాజ్ కు విశ్రాంతి లభించిన నేపథ్యంలో డిఎస్పి గా బాధ్యతలు స్వీకరించారు.. డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిరాజ్ నేరుగా బంజారా హిల్స్ లోని రెయిన్ బో ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని.. ప్రతి అవరోధాన్ని దాటాలని.. అప్పుడే మన దృఢ సంకల్పం అర్థమవుతుందని పేర్కొన్నారు.