Hari Hara Veeramallu Movie Update : హరి హర వీరమల్లు’ చివరి షెడ్యూల్ మొదలు..మొదటి పాట విడుదల తేదీ ఖరారు!

పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసేందుకు ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 23 వ తారీఖున షెడ్యూల్ మొదలైంది. ఆరోజు నుండి 10 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్న ఆయన, ఎల్లుండి నుండి చివరి షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. రేపు మంగళగిరి లో వేసిన సెట్స్ లో చివరి షెడ్యూల్ ప్రారంభం కానుంది.

Written By: Vicky, Updated On : October 13, 2024 7:47 pm

Hari Hara Veeramallu Movie Update

Follow us on

Hari Hara Veeramallu Movie Update :  2020 వ సంవత్సరం లో ‘వకీల్ సాబ్’ చిత్రం షూటింగ్ తో పాటుగా, ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ ని కూడా మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్. ప్రారంభం లో షూటింగ్ కార్యక్రమాలు జెట్ స్పీడ్ లో మొదలయింది. మొదటి షెడ్యూల్ పూర్తి అవ్వగానే ఒక మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది మూవీ టీం. అందరూ ఒక్కసారిగా షాక్, సినిమాలంటే పెద్దగా ఆసక్తి చూపించని పవన్ కళ్యాణ్ నుండి ఇలాంటి సినిమా ఎలా సాధ్యం అని. 2022 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు అప్పట్లో మోషన్ పోస్టర్ ద్వారా మేకర్స్ అధికారికంగా తెలిపారు. కానీ ఆ తర్వాత షూటింగ్ కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మధ్యలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అవ్వడం వల్ల ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతూ వచ్చింది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసేందుకు ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 23 వ తారీఖున షెడ్యూల్ మొదలైంది. ఆరోజు నుండి 10 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్న ఆయన, ఎల్లుండి నుండి చివరి షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. రేపు మంగళగిరి లో వేసిన సెట్స్ లో చివరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పోవెల్ సారథ్యం లో 400 నుండి 500 మంది జూనియర్ ఆర్టిసులతో పోరాట సన్నివేశాన్ని మొదలు పెట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ 15 వ తారీఖు నుండి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ నెలాఖరుతో ఆయనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి అవ్వబోతుంది. ఆ తర్వాత మిగిలిన ప్యాచ్ వర్క్ ని నవంబర్ 10 వ తారీఖు లోపు పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని చకచకా మొదలు పెట్టబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఒక స్పెషల్ సాంగ్ పాడాడు.

ఈ పాట రికార్డింగ్ కూడా పూర్తి అయ్యిందట. వచ్చే నెల దీపావళి సందర్భంగా ఈ పాటను విడుదల చేయబోతున్నారు మూవీ టీం. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మోషన్ పోస్టర్, గ్లిమ్స్ వీడియో, టీజర్ ఇలా అన్నిటికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ క్రిష్ మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఔట్పుట్ ఇచ్చాడంటూ అభిమానులు పొంగిపోయారు. ఇక నుండి ఈ సినిమా నుండి రాబోయే ప్రమోషనల్ కంటెంట్ కూడా అంతకు మించి ఉంటుందని సమాచారం. నిన్న దసరా కానుకగా విడుదల చేసిన పోస్టర్ కి సోషల్ మీడియా షేక్ అయ్యింది. మూడు బాణాలను చేతిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఎక్కుపెడుతున్నట్టుగా కనిపించిన ఈ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటివి ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలకు సంబంధించిన కంటెంట్ సిద్ధంగా ఉందట.