https://oktelugu.com/

Johnny  Master : బిగ్ బ్రేకింగ్: జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు..కన్నీళ్లు రప్పిస్తున్న హాస్పిటల్ దృశ్యాలు..వైరల్ అవుతున్న వీడియో!

తన కొడుకు జీవితం కళ్ళ ముందే కుప్పకూలిపోతుండం చూసిన జానీ మాస్టర్ తల్లి కి గుండెపోటు వచ్చింది. కాసేపటి క్రితమే ఆయన సతీమణి సుమలత, ట్విట్టర్ లో జానీ మాస్టర్ అకౌంట్ నుండి ఆయన తల్లి హాస్పిటల్ లో ఉన్న వీడియో ని షేర్ చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 13, 2024 / 08:10 PM IST

    Johnny  Master

    Follow us on

    Johnny  Master :  ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గత 20 రోజుల నుండి ఆయన రిమాండ్ లోనే ఉన్నాడు. నేషనల్ అవార్డు ని అందుకోవడం కోసం బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నాడు. బెయిల్ కూడా మంజూరు అయ్యింది. కానీ జానీ మాస్టర్ మీద పోస్కో చట్టం క్రింద కేసు నమోదు అవ్వడంతో ఆయనకి ఇచ్చిన అవార్డుని వెనక్కి తీసుకుంటున్నట్టుగా నేషనల్ అవార్డు కమిటీ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది జానీ మాస్టర్ కి ఘోరమైన అవమానం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కస్టపడి సంపాదించుకున్న పేరు ఎలాగో మసకబారింది, కనీసం తన పేరు మీద వచ్చిన నేషనల్ అవార్డుని అయినా తీసుకోవాలని ఆయన కోరుకున్నాడు. కానీ అది జరగకపోయేలోపు జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు తీవ్రమైన శోకానికి గురయ్యారు.

    తన కొడుకు జీవితం కళ్ళ ముందే కుప్పకూలిపోతుండం చూసిన జానీ మాస్టర్ తల్లి కి గుండెపోటు వచ్చింది. కాసేపటి క్రితమే ఆయన సతీమణి సుమలత, ట్విట్టర్ లో జానీ మాస్టర్ అకౌంట్ నుండి ఆయన తల్లి హాస్పిటల్ లో ఉన్న వీడియో ని షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నేషనల్ అవార్డు కోల్పోవడం తో పాటు, జానీ మాస్టర్ గురించి నిజానిజాలు తెలుసుకోకుండా మీడియా రాస్తున్నరాతలు, ఆరోపణలు వెనుక అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండా, కోర్టు లో కేసు విచారణ జరుగుతుండగా తన కొడుకు పై ప్రచారం అవుతున్న కొన్ని అసత్య కథనాలు చూసి జానీ మాస్టర్ తల్లి తీవ్రమైన మనస్తాపానికి గురి అవ్వడంతో ఆమెకు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆమెను హాస్పిటల్ లో చేర్పించాము. ఆమె పరిస్థితి ప్రస్తుతానికి విషమంగానే ఉంది. ఇలాంటి కథనాలు ప్రచారం చేసిన వారికి ఈ పాపం ఊరికే పోదు, మీకు ఉన్నట్టుగానే అందరికీ కుటుంబాలు ఉంటాయి. త్వరలోనే అసలు విషయాలు బయటకి వస్తాయి, జానీ మాస్టర్ నిర్దోషిగా బయటకి వస్తాడు’ అంటూ ఆమె పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

    ఈ వీడియో ని చూసి కొందరు జానీ మాస్టర్ చేసిన పనుల కారణంగా ఆమె తల్లికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని కామెంట్ చేస్తే, మరికొందరు మాత్రం ఈ పాపం ఊరికే పోదు, జానీ మాస్టర్ తప్పు చేసినట్టు నిర్ధారణ కాలేదు, అప్పటి వరకు మీడియా మౌనం వహిస్తే బాగుంటుంది అని కామెంట్స్ చేసారు, త్వరలోనే నిజానిజాలు కోర్టు తేల్చాలని ఆ పోస్ట్ క్రింద కామెంట్స్ పెట్టాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మరి జానీ మాస్టర్ నిర్దోషిగా బయటకి వస్తాడా?, లేదా జైలుకే పరిమితం అవుతాడా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవలే జానీ మాస్టర్ సతీమణి ఫిలిం ఛాంబర్ కి ఒక ఆడియో రికార్డింగ్ ఇవ్వడం అది సోషల్ మీడియా లో తెగ వైరల్ అవ్వడం మన అందరికీ తెలిసిందే.