IND vs SA T20 Match : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలని అనుకుంటున్నది. ఈ క్రమంలో శుక్రవారం నుంచి దక్షిణాఫ్రికా తో నాలుగు టి20లో సిరీస్ ఆడేందుకు సమాయత్తమవుతోంది. సూర్య కుమార్ నేతృత్వంలో యువ భారత ఇప్పటికే దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టింది.. ఇటీవల టీ -20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. 2007 తర్వాత మళ్లీ ఇన్ని సంవత్సరాలకు టి20 వరల్డ్ కప్ సాధించింది. ఫైనల్ లో భారత్ చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా.. నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఇటీవల టీమిండియా వరుసగా మూడు టి20 సిరీస్ గెలిచింది. అచంచలమైన దూకుడుతో కనిపిస్తోంది. అందరూ ఆటగాళ్లు ఫామ్ లో ఉండడంతో భారత జట్టు ఈ సిరీస్ లో హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా మైదానాలు బౌన్సీ వికెట్ గా ఉంటాయి. అలాంటి మైదానాలపై సత్తా చాటి.. టీమిండియాలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చాలామంది ఆటగాళ్లు భావిస్తున్నారు.. అయితే ఇదే సమయంలో టీం ఇండియాకు గట్టి పోటీ ఇవ్వాలని దక్షిణాఫ్రికా భావిస్తుంది. ఇటీవలి చివరి ఆరు టి20 మ్యాచ్ లలో దక్షిణాఫ్రికా ఐదు ఓడింది. ఇలాంటి పరిస్థితుల్లో టీం ఇండియాకు ఆ జట్టు ఎలాంటి పోటీ ఇస్తుందనేది ఆసక్తి కరం. ఇక భారత్ మాత్రం ఇటీవల ఆడిన 12 మ్యాచ్లలో పదింట్లో విజయం సాధించింది. ఒక దాంట్లో మాత్రమే పాలైంది. మరొక మ్యాచ్ టై చేసుకుంది. అయితే భారత జట్టులో ఉన్న 15 మంది ఆటగాళ్లలో 11 మందిని వివిధ ఐపిఎల్ జట్లు రిటైన్ చేసుకోవడం విశేషం.
వారు రాణించాలి
ఈ మ్యాచ్లో భారత్ ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ రాణించాల్సి ఉంది. సంజు ఇప్పటివరకు అతడు 33 మ్యాచులు ఆడగా.. కేవలం ఎనిమిది సార్లు మాత్రమే ఓపెనింగ్ గా బరిలోకి వచ్చాడు. ఇక బంగ్లాతో ఇటీవల జరిగిన మ్యాచ్లో 47 బంతుల్లోనే 111 పరుగులు చేసి సత్తా చాటాడు. అదే విధ్వంసాన్ని దక్షిణాఫ్రికాపై కొనసాగిస్తే తిరుగు ఉండదు.. ఇదే సమయంలో టీమిండియా రెగ్యులర్ ఓపెనర్లు జైస్వాల్ – గిల్ కు గట్టి పోటీ ఎదురవుతుంది. మరోవైపు ఈ విభాగంలో అభిషేక్ శర్మ కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. ఐపీఎల్ లో అతడు అదరగొట్టాడు. టి20లలో జింబాబ్వే పై సెంచరీ చేసిన అతడు.. తదుపరి ఆరు మ్యాచ్లలో 20 పరులకు మించి చేయలేకపోయాడు. తిలక్ వర్మ కూడా ఈ ఫార్మాట్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నాడు. వైశాఖ్, ఆవేష్, అర్ష్ దీప్ సింగ్, యశ్ దయాళ్ వంటి యువ బౌలర్లు ఈ సిరీస్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇందులో వైశాఖ్, యశ్ తొలిసారి బౌలింగ్ చేస్తున్నారు. యశ్ ను ఇటీవల బెంగళూరు జట్టు రిటైన్ చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో అతడు ఎలా రాణిస్తాడనేది ఆసక్తి కరం.
వరుస ఓటములు
దక్షిణాఫ్రికా జట్టు ఇటీవల ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లతో వన్డే సిరీస్ లు ఆడింది. అయితే వీటిపై ఓటములు ఎదుర్కోవడంతో ఆ జట్టు పరువు తీసాయి. బ్యాటింగ్, బౌలింగ్ లో ఆటగాళ్లు అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. క్రమంలో జోరు మీదున్న భారత్ ను వారు కట్టడి చేయడం కత్తి మీద సాము లాంటిదే. స్వదేశంలో ఆడుతున్నారు కాబట్టి మెరుగైన ప్రదర్శన చేయాలని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భావిస్తున్నారు. మిల్లర్, క్లాసెన్ ఉన్నారు కాబట్టి మిడిల్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. వీరికి జతగా స్టబ్స్ ఉండడంతో భారత బజార్లకు ఇబ్బంది తప్పకపోవచ్చు. జాన్సన్, కొట్జి వంటి బౌలర్లు గట్టి కం బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక కెప్టెన్ మార్ క్రమ్ కు ఈ సిరీస్ గెలవడం అత్యంత ముఖ్యం. డర్బన్ లో ఈ మ్యాచ్ రాత్రి 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓటీటీ లో జియో సినిమా లో, స్పోర్ట్స్ 18 ఛానల్ లో లైవ్ చూడొచ్చు.
జట్ల అంచనా
భారత్: సంజు, అభిషేక్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హార్దిక్ పటేల్, సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, ఆవేశ్, అర్ష్ దీప్.
సౌత్ ఆఫ్రికా
కొట్జి, కేశవ్, బార్ట్ మాన్, జాన్సన్, క్లాసెన్, హెన్రిక్స్, రికెల్టన్, మార్క్రం(కెప్టెన్), క్రుగెర్, స్టబ్స్, మిల్లర్.