Jitender Reddy :తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు మాత్రం వాళ్ళను వాళ్ళు స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ప్రస్తుతం కొంతమంది దర్శకులు సొంత కథలతో సినిమాలను చేస్తుంటే మరి కొంత మంది మాత్రం బయోపిక్ లతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం మనం ఈ మధ్యకాలంలో చాలాసార్లు గమనిస్తూనే ఉన్నాము… ఇక అదే విధంగా దర్శకుడు విరించి వర్మ జితేందర్ రెడ్డి అనే బయోపిక్ తో ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఈ సినిమా కథ విషయానికి వస్తే జగిత్యాల లో నక్సలైట్లు రాజకీయ నాయకులకు మధ్య జనం ఎలా విలవిల్లాడుతున్నారు వారి వల్ల సామాన్య మానవులు ఎలా చనిపోతున్నారనే విషయాన్ని తెలుసుకున్న జితేందర్ రెడ్డి జనానికి సేవ చేయాలంటే రాజకీయాలే మార్గంగా ఎంచుకొని తను కూడా రాజకీయ నాయకుడిగా మారి జనానికి సేవ చేద్దాం అనుకుంటాడు. మరి తను అనుకున్న గోల్ ని రీచ్ అయ్యాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాని దర్శకుడు విరించి వర్మ కథ రూపంలో రాసుకున్నప్పుడు బాగానే ఉంది. కానీ దానికి స్క్రీన్ ప్లే ని యాడ్ చేయడంలో గాని తెరమీద ప్రజెంట్ చేయడంలో గాని ఆయన పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. అసలు సీన్స్ ని ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ గా మలచకుండా చూస్తున్నంత సేపు ఏదో సాగుతూనే ఉన్నట్టుగా సినిమా అనేది పోతూనే ఉంటుంది తప్ప ఏ ఒక్కచోట కూడా ఇంట్రెస్ట్ కలిగించదు. ఇక ప్రేక్షకుడిని ఆ సినిమాలో ఇన్వాల్వ్ చేయదు. అలాగే క్రైసిస్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఇంకా క్యారెక్టరైజైషన్స్ ను కూడా అంత పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేసుకొని మరి రాసుకోలేకపోయారు.
దానివల్ల ఈ సినిమాలో కనిపించే ప్రతి సీన్ కూడా ఏదో లైట్ వెయిట్ తో ఉంటుంది తప్ప ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకునే విధంగా అయితే ఉండదు. నిజానికి బయోపిక్ సినిమా అంటే చూస్తున్నంత సేపు కలల్లో నీళ్లు తిరగాలి. వాళ్ళ మనసులో ఆ సినిమాకు సంబంధించిన ఎమోషన్ ని ఫీల్ అవుతూ ఉండాలి. కానీ అలాంటివి ఈ సినిమా చూస్తున్నప్పుడు పెద్దగా జరగవు మరి విరించి వర్మ లాంటి ఒక సెన్సిబుల్ దర్శకుడు ఇలాంటి సినిమా కోసం దాదాపు ఆరు సంవత్సరాల సమయాన్ని కేటాయించడమనేది నిజంగా సగటు ప్రేక్షకుడిని ఆశ్చర్యానికి గురిచేస్తుందనే చెప్పాలి.
ఇక గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కొంతవరకు సినిమాను ఎలివేట్ చేసే ప్రయత్నం చేసినప్పటికి ఆ సీన్స్ లో ఉన్న ఇంటెన్స్ డ్రామా అనేది వర్కౌట్ కాకపోవడంతో ఆయన కూడా ఏం చేయలేకపోయాడు… ఇక కథగా రాసుకున్నప్పుడు బాగానే ఉంది కానీ దర్శకుడు దానిని సరిగ్గా డీల్ చేయలేకపోయాడనేది స్క్రీన్ మీద ఈ సినిమాను చూస్తున్నంత సేపు ప్రతి ప్రేక్షకుడు ఫీలవుతూనే ఉంటాడు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించిన రాకేష్ వర్రె ఆ క్యారెక్టర్ కి అంత బాగా సెట్ అవ్వలేదనే చెప్పాలి. ఇక కాలేజీ డేస్ లో ఉన్నప్పుడు ఆయనను కాలేజీ స్టూడెంట్ అంటే మనం అసలు నమ్మలేకపోతున్నాం. ఇక ఆయన కాకుండా వేరే ఎవరినైనా హీరోని పెట్టి ఉంటే బాగుండేది. కానీ రాకేష్ వర్రే మాత్రం యాక్టింగ్ లో తన వంతు ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఒక రకంగా చెప్పాలంటే జితేందర్ రెడ్డి క్యారెక్టర్ లో ఆయన చాలా బాగా నటించినప్పటికి ఆయన ఆహార్యం అనేది ప్రేక్షకుడు చూస్తున్నంత సేపు అతన్ని ఆ క్యారెక్టర్ లో జీర్ణించుకోలేకపోయారు… ఇక హీరోయిన్ గా చేసిన నటి కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికి ఆమె పాత్ర పెద్దగా లేకపోవడం అనేది కొంతవరకు మైనస్ అయిందనే చెప్పాలి… ఇక మిగిలిన పాత్రల్లో నటించిన వారు కొంతవరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
గోపి సుందర్ మ్యూజిక్ అంత పెద్దగా ఆకట్టుకోనప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఏదో కొంత హైప్ అయితే తీసుకొచ్చాడు… సినిమాటోగ్రఫీ అయితే చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. సీరియల్ చూస్తున్న ఫీల్ అయితే కలుగుతుంది. ఇక ఆ బ్లాక్ సెట్టింగ్ లో గాని, విజువల్స్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయడంలో గాని సినిమాటోగ్రాఫర్ ఫేయిల్ అయిపోయాడనే చెప్పాలి… ఇక ఎడిటింగ్ కూడా అంతా పర్ఫెక్ట్ గా చేయలేదు. ఇక దాంతోపాటుగా డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చినట్టుగా సినిమా చూస్తున్నంత సేపు అనిపిస్తూనే ఉంటుంది…
ప్లస్ పాయింట్స్
స్టోరీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
కొన్ని చోట్ల ఆర్ట్ వర్క్ బాగుంది…
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
ఒక్క ట్విస్ట్ కూడా లేకపోవడం
సీన్స్ ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వట్లేదు…
రేటింగ్
ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్స్ 2/5