Homeఆంధ్రప్రదేశ్‌AP weather alert: వేసవి ప్రారంభంలోనే ఏపీకి 'చల్లటి' కబురు!

AP weather alert: వేసవి ప్రారంభంలోనే ఏపీకి ‘చల్లటి’ కబురు!

AP Weather Alert: వేసవి ( summer) ప్రారంభంలోనే ఏపీకి గుడ్ న్యూస్. వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతోంది. ఇటువంటి సమయంలో వర్షాలు కురవనున్నాయని అమరావతి లోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా కోస్తాంధ్రకు వర్ష సూచన చేసింది. గత కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటువంటి సమయంలో ఈ వర్ష సూచన ఏపీ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే విషయమే. ప్రారంభంలోనే వేసవితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ప్రజలు. వర్షాలు పడితే కాస్త సేదదీరుదామని భావిస్తున్నారు. అటువంటి వారికి ఇది గుడ్ న్యూస్.

ఉపరితల ద్రోణి
ప్రస్తుతం బంగాళాఖాతంలో( Bay of Bengal) ఒక ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర ఒడిస్సా నుంచి విదర్భ మీదుగా చత్తీస్గడ్ వరకు.. సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఇది కొనసాగుతోంది. దీంతో పాటు తమిళనాడు, కర్ణాటక మీదుగా మరాట్వాడా వరకు గాలి విచ్చిన్నత ఏర్పడింది. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఈనెల 7 నుంచి కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

Also Read: ఉగాదికి ఏపీలో రాజకీయ సంచలనం!

పెరిగిన ఉష్ణోగ్రతలు..
రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి భానుడు ప్రతాపం చూపుతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు( day temperature ) అమాంతం పెరిగాయి. సోమవారం ఒక్క కర్నూలులోనే అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాయలసీమ వ్యాప్తంగా ఉష్ణోగ్రతల తీవ్రత అలానే కొనసాగుతోంది. నంద్యాల, కడప, అనంతపురం జిల్లాల్లో ఎండ 37 డిగ్రీలను దాటేసింది. నరసాపురం, కావలి వంటి ప్రాంతాల్లో సాధారణ కంటే రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇకనుంచి రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాలో సైతం ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది.

పొగ మంచు సైతం..
ఈ ఏడాది చలి తీవ్రత చాలా వేగంగా తగ్గింది. కానీ ఇప్పటికి పొగ మంచు కురుస్తూనే ఉంది. నిన్న కోస్తాంధ్రతో పాటు యానంలో పొగ మంచు కొనసాగింది రేపు సైతం పొగ మంచు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఒకవైపు ఎండ, ఇంకోవైపు పొగ మంచు, మరోవైపు ఈ నెల ఏడు నుంచి వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుండడం విశేషం. ఏకకాలంలో ఇలా వాతావరణంలో మార్పులు సంతరించుకుంటున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper
Exit mobile version