Homeఆంధ్రప్రదేశ్‌Visakhapatnam film industry: సినిమా లొకేషన్స్ పుష్కలం.. రావాల్సింది పరిశ్రమే!

Visakhapatnam film industry: సినిమా లొకేషన్స్ పుష్కలం.. రావాల్సింది పరిశ్రమే!

Visakhapatnam film industry: దేశంలోనే పర్యాటక, సుందరనగరం విశాఖ( Visakhapatnam). అందమైన పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి సోయగాలు, ఎత్తయిన కొండలు.. ఎటు చూసినా కనిపించే పచ్చదనం, ఆకర్షణీయమైన ఎర్రమట్టి దిబ్బలు, సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం, సువిశాలమైన బీచ్ లు, ఉద్యానవనాలు, ఆలయాలు, మధ్యలో అద్భుత నగరం. అయితే ఇంతటి పర్యాటక నగరానికి పర్యాటకుల తాకిడి నిత్యం ఉంటుంది. కానీ సినీ పరిశ్రమకు అనుకూలమైన వాతావరణం ఉంది కానీ.. సినీ పరిశ్రమను ఇక్కడకు తెచ్చే ప్రయత్నాలు జరగడం లేదన్న విమర్శ ఉంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నా.. అటువంటి ప్రయత్నం జరగకపోవడం ఏమిటనే విమర్శ ఉంది.

చాలా అనుకూలం..
విశాఖ నగరంలో సినిమా షూటింగులకు( cinema shootings ) చాలా అనుకూలం. ఏ రకమైన సినిమా అయినా తీసేందుకు అనుకూలమైన స్పాట్లు ఉన్నాయి. క్రైమ్, మాఫియా, లవ్, రొమాన్స్, ఫ్యామిలీతో పాటు గ్రామీణ నేపథ్యం.. ఇలా ఏ బ్యాక్ గ్రౌండ్ సినిమా కైనా సరిపోయే లొకేషన్ విశాఖలో పుష్కలంగా ఉన్నాయి. ఫైట్ సీన్లకు పోర్టులు, ఫిషింగ్ హార్బర్, పూర్ణ మార్కెట్ లాంటివి ఉన్నాయి. ఇక సింహాచలం, కైలాసగిరి తో పాటు ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. అయితే విశాఖలో సినిమా చిత్రీకరణ జరిపితే సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. చాలా తక్కువ ఖర్చుతో అవుట్ డోర్ లొకేషన్స్ విశాఖలో పుష్కలం. ప్రకృతి రమణీయతకు నెలవు అయిన విశాఖలో సినిమాలంటే సినిమా వాళ్లకు కూడా చాలా ఇష్టం.

Also Read: వేసవి ప్రారంభంలోనే ఏపీకి ‘చల్లటి’ కబురు!

అన్ని రకాల ప్రయోజనాలు..
ఎందుకో గాని రాష్ట్ర విభజన జరిగిన తరువాత సినీ పరిశ్రమ విశాఖకు వచ్చే ఏర్పాట్లు సరిగ్గా జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. సినీ పరిశ్రమ వస్తే సినిమాల్లో నటించే అవకాశాలు వస్తాయి. 24 ఫ్రేమ్స్ లో ఉపాధి అవకాశాలు దక్కుతాయి. వర్ధమాన, ఔత్సాహిక కళాకారులకు చేతినిండా పని దక్కుతుంది. సాంకేతిక సహాయకులకు, కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. అయితే విశాఖకు సినీ పరిశ్రమను విస్తరించేందుకు సరైన ఏర్పాట్లు జరగడం లేదు. మరోవైపు సినీ ప్రముఖులు హైదరాబాదు నుంచి విశాఖకు వచ్చేందుకు ఇష్టపడడం లేదని విమర్శ కూడా ఉంది. ఏపీ నుంచి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం కావాలి కానీ.. పరిశ్రమ విస్తరించి ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన సినీ పెద్దలు మాత్రం ఆలోచన చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం.. తెలుగు చిత్ర పరిశ్రమను విశాఖకు రప్పించే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper
Exit mobile version