Ind vs Eng 5th Test Updates: నాలుగో టెస్ట్ డ్రా అయిన నేపథ్యంలో.. టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ఐదో టెస్ట్ లో ప్రయోగాలకు సిద్ధమైంది. నాలుగు టెస్టులో తేలిపోయిన కాంబోజ్, శార్దుల్ ఠాకూర్ పై వేటు వేస్తుందని తెలుస్తోంది. వారిద్దరిని పక్కనపెట్టి.. ఇద్దరు కొత్త బౌలర్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం నుంచి కోలు కోక పోవడంతో అతని స్థానంలో ధృవ్ జూరెల్ ఆడటం ఖాయమని సమాచారం.
Also Read: 5-0తో కొట్టింది.. ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టింది
నాలుగో టెస్టులో శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కాంబోజ్ దారుణంగా పరుగులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారిని పక్కన పెట్టి వారి స్థానంలో అర్ష్ దీప్ సింగ్, కులదీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది. సాయి సుదర్శన్ రెండవ ఇన్నింగ్స్ లో విఫలమైన నేపథ్యంలో ఒకవేళ అతడిని పక్కన పెడితే.. ఆస్థానంలో ఆకాష్ దీప్ కు చోటు కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. సాయి సుదర్శన్ తొలి ఇన్నింగ్స్ లో ఆకట్టుకున్న నేపథ్యంలో.. అతని స్థానాన్ని మార్చే అవకాశం ఉండకపోవచ్చని కొన్ని మీడియా సంస్థలు తమ కథనాలలో చెబుతున్నాయి. బ్యాటింగ్ విషయంలో గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ భీకరమైన ఫామ్ లో ఉన్నారు. వారికి మరో ఇద్దరు బ్యాటర్లు గనుక తోడైతే టీమ్ ఇండియాకు ఇబ్బంది ఉండదు. కాకపోతే బౌలింగ్ విషయంలోనే టీమ్ ఇండియా ఇబ్బంది పడుతోంది. సిరాజ్ వికెట్లు తీయలేకపోతున్నాడు. బుమ్రా లయ తప్పి కనిపిస్తున్నాడు. అందువల్లే బౌలింగ్ లో కొత్తదనం కోసం మేనేజ్మెంట్ తాపత్రయపడుతోంది. ఇందులో భాగంగానే అర్ష్ దీప్ సింగ్ కు అవకాశం కల్పించారని తెలుస్తోంది. వినూత్నంగా బౌలింగ్ వేయడంలో అర్ష్ దీప్ సింగ్ సిద్ధహస్తుడు. పైగా ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. వర్క్ లోడ్ తో ఇబ్బంది పడుతున్న బుమ్రా, సిరాజ్ కు అతడు అండగా ఉండగలడు. మరోవైపు ఆకాష్ దీ ప్ కూడా సత్తా చాట గలడు. లార్డ్స్ టెస్టులో అతడు విఫలమైనప్పటికీ.. అతడి మీద మేనేజ్మెంట్ నమ్మకం ఉంచుతోంది.
Also Read: జడేజాతో ఇంగ్లండ్ ఆటగాళ్ల గొడవ.. అసలు ఆ వీడియోలో ఏం జరిగిందంటే?
శార్దూల్ ఠాకూర్ ను పక్కన పెడితే అతడి స్థానంలో కులదీప్ యాదవ్ ను తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. కులదీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ వేస్తాడు. వైవిధ్యంగా బంతులు వేస్తాడు. అవసరమైతే బ్యాటింగ్ కూడా చేయగలడు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు.. ఒక స్పిన్నర్ సమీకరణంతో భారత్ ఐదో టెస్టులో బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కూడా ఆల్ రౌండర్లు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు వికెట్లు తీయగలరు. అందువల్లే వారికి జతగా కులదీప్ యాదవ్ ఉంటాడని మేనేజ్మెంట్ భావిస్తోంది..