Woman Speech on Easy Money: కష్టపడితేనే ఐదు వేళ్ళూ నోట్లకి వెళ్తాయి. చెమట చిందిస్తేనే స్వర్గసుఖాలు దక్కుతాయి. అంతే తప్ప ఏసి రూములలో కూర్చుంటే. . ఇంకా ఏవేవో మాటలు చెబితే డబ్బులు రావు. మరీ ముఖ్యంగా సౌకర్యాలు లభించవు. ఇవన్నీ జరగాలంటే కష్టపడాలి. ఒళ్ళు వంచాలి. చెమట చిందించాలి. అవసరమైతే కొన్ని సందర్భాలలో రక్తాన్ని చెమటగా మార్చాలి. ఇన్ని చేసినప్పటికీ కొన్ని సందర్భాలలో ఏవీ దక్కవు. దక్కినవన్నీ నిలబడవు. ఏదైనా మన చెంత ఉండాలంటే.. మనకు చెందాలంటే రాసిపెట్టి ఉండాలంటారు పెద్దలు.
View this post on Instagram
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం.. ఓ మహిళ విచిత్రమైన సమాధానం చెబుతోంది. కష్టపడకుండానే డబ్బు సంపాదించవచ్చని.. చెమట చుక్కలు చిందించకుండానే బంగారాన్ని దక్కించుకోవచ్చని.. జస్ట్ ఒక మాట మాట్లాడితే గ్యాస్ సిలిండర్ సొంతం చేసుకోవచ్చని అంటున్నది. వాస్తవానికి అది అంత సులభం కాదు. జరిగే పని అసలు కాదు. ఈ విషయం ఆమె మాటలు వింటున్న వ్యక్తులకు తెలిసినప్పటికీ.. ఏమి అనలేకపోతున్నారు. పైగా ఆమె చెప్పిన మాటలను శ్రద్ధగా వింటున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠం చెబితే విద్యార్థులు ఎలా అయితే వింటారో.. అలా చెవులు పెద్దవి చేసి మరీ వింటున్నారు.
Also Read: బంగారం కొనుగోళ్లకు ఇదే మంచి సమయం.. వెంటనే కొనేయండి.. ఎందుకంటే?
వాస్తవానికి మంత్రాలకు చింతకాయలు రాలవు.. మాటలకు డబ్బులు సొంతం కావు. బంగారం దక్కడం సాధ్యపడదు. అన్నిటికంటే ముఖ్యంగా నిండుకున్న గ్యాస్ మళ్లీ ఫిల్ అవ్వదు. అయితే ఆ మహిళ అలా ఎందుకు మాట్లాడుతుందో.. అలా ఎందుకు మిగతా వారిని అంతుపట్టడం లేదు. కాకపోతే ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తున్నది. “ఆమె ఏదో మాట్లాడుతున్నది. ఆమె మాట్లాడే మాటలో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది ఎవరూ గుర్తించడం లేదు. ఆమె మాటలను నమ్ముతున్నారు. పొట్ట చెక్కలయ్యే విధంగా నవ్వుతున్నారని” నెటిజన్లు పేర్కొంటున్నారు.