AFG vs ENG : చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ – ఇంగ్లాండ్ (AFG vs ENG) జట్లు బుధవారం తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్(Ibrahim Jadhran) కళ్ళు చెదిరే సెంచరీ చేశాడు. ఒకానొక దశలో డబుల్ సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. కాని చివరికి 177 పరుగుల వద్ద తన ఇన్నింగ్స్ ముగించాడు. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీలోనే ఆఫ్ఘనిస్తాన్ జట్టులో శతకం చేసిన బ్యాటర్ గా ఇబ్రహీం జద్రాన్ రికార్డ్ సృష్టించాడు. అంతేకాదు వన్డేలలో ఆరవ సెంచరీ చేశాడు.. వాస్తవానికి ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు మెరుగైన ఆరంభం లభించలేదు. 5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 15 పరుగులు మాత్రమే చేసింది. ఒకే ఓవర్లో ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘనిస్తాన్ జట్టును తీవ్రంగా దెబ్బ కొట్టాడు. ఇక మూడో వికెట్ కూడా అతడే పడగొట్టాడు. దీంతో ఆఫ్గానిస్తాన్ 9 ఓవర్లలో 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈదశలో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ నిదానంగా ఆడాడు. సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. స్కోర్ బోర్డును పాప కింద నీరు లాగా ముందుకు తీసుకెళ్లాడు. మరో ఆటగాడు హస్మతుల్లా షాహిది తన వంతు సహకారం అందించాడు. దీంతో ఆఫ్గనిస్తాన్ నాలుగో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. అనంతరం వీరిద్దరూ శతక భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు.
సెంచరీ చేశాడు
ఇంకా ఈ కార్యక్రమంలో ఇబ్రహీం 16 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో సెంచరీ పూర్తి ను చేసుకున్నాడు. వన్డేలలో ఇబ్రహీం అత్యధిక స్కోరు 162. అయితే ఇప్పుడు దానిని కూడా అతడు అధిగమించాడు. 146 బంతుల్లో 12 ఫోర్లు, ఆ ఆరు సిక్సర్లతో 177 పరుగులు చేశాడు. వన్డేలలో ఇబ్రహీం కు ఇదే అత్యధిక స్కోరు. ఇబ్రహీం షాహిదీతో 103, అజ్మతుల్లాతో 72 , నబీ తో 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఆర్చర్ మూడు, లివింగ్ స్టోన్ రెండు వికెట్లు సాధించారు. 326 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు వికెట్లేమీ నష్టపోకుండా మూడు ఓవర్లలో 17 పరుగులు చేసింది. సాల్ట్ 11, డకెట్ 6 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
Also Ready : టీమిండియాతో మ్యాచ్.. పాక్ కీలక నిర్ణయం..