IND vs NZ : న్యూజిలాండ్ రెండుసార్లు ఐసీసీ టోర్నీలు సాధించగా.. ఆ రెండు సందర్భాల్లోనూ టీం ఇండియా పై గెలవడం విశేషం. ఇక ప్రస్తుతం టైటిల్ ఫేవరెట్ గా టీమిండియా బరిలోకి దిగుతున్నప్పటికీ.. న్యూజిలాండ్ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. దుబాయ్ మైదానాలపై వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా అదరగొడుతున్నప్పటికీ.. న్యూజిలాండ్ జట్టులో స్పిన్ బౌలర్లకు కొదవలేదు. శాంట్నర్, బ్రేస్ వెల్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ న్యూజిలాండ్ జట్టులో మేటి స్పిన్ బౌలర్లుగా కొనసాగుతున్నారు. దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్లో శాంట్నర్ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. భారత బౌలర్లు కూడా అద్భుతమైన ఫామ్ లో ఉండడంతో.. ఫైనల్ మ్యాచ్ స్పిన్నర్ల మధ్య జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు భారత్ గెలిచిన నాలుగు మ్యాచ్లలో సికింద్రాబాద్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. వరుణ్ చక్రవర్తి ఒక మ్యాచ్లో ఏకంగా ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు..శాంట్నర్ అయితే దక్షిణాఫ్రికా జరిగిన మ్యాచ్లో మూడు కీలక వికెట్లను పడగొట్టాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రెండు జట్లలో స్పిన్నర్లు సాధించిన అద్భుతాలు మామూలువికావు.
Also Read : CT ఫైనల్ మ్యాచ్ కు సర్వం సిద్ధం.. ఎలాంటి పిచ్ ను రూపొందించారంటే..
చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా స్పిన్ బౌలర్లలో కులదీప్ నాలుగు మ్యాచ్లలో అయిదు, వరుణ్ చక్రవర్తి రెండు మ్యాచ్లలో 7, అక్షర్ నాలుగు మ్యాచ్లలో ఐదు, రవీంద్ర జడేజా నాలుగు మ్యాచ్లలో నాలుగు వికెట్లు పడగొట్టారు. వీరిలో వరుణ్ చక్రవర్తి తన మాయాజాలాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. గ్రూప్ దశలో న్యూజిలాండ్ జట్టుకు పెను సవాల్ లాగా నిలిచాడు వరుణ్ చక్రవర్తి. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ జట్టు పతనాన్ని శాసించాడు. ఇతడి నుంచి న్యూజిలాండ్ జట్టుకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్ 7 వికెట్లు పడగొట్టి టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు. రచిన్ రవీంద్ర 2, బ్రేస్ వెల్ 6 వికెట్లు పడగొట్టారు. ఇక ఫైనల్ మ్యాచ్లో శాంట్నర్ నుంచి భారత బ్యాటర్లకు ఇబ్బంది తప్పదు. బ్రేస్వెల్ కూడా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు.. రచిన్ రవీంద్ర కూడా తక్కువేమీ కాదు. మొత్తంగా చూస్తే దుబాయ్ మైదానంపై స్పిన్నర్లు తిప్పేయడం గ్యారంటీ. ఎందుకంటే తిప్పే వారిదే కప్పు కాబట్టి..
Also Read : CT ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటన.. కోచ్, టీం మీటింగ్ లో చెప్పేశాడా?