Ravi Teja
Ravi Teja: స్టార్ హీరోలకు వయసు జస్ట్ నెంబర్ మాత్రమే. 50-60 ఏళ్ల ప్రాయంలో కూడా లవ్ ట్రాక్స్, రొమాంటిక్ సీన్స్ లో నటిస్తారు. కమర్షియల్ సినిమాకు కావలసిన అన్ని హంగులు స్టార్ హీరోల చిత్రాల్లో ఉంటాయి. సాంగ్స్, ఫైట్స్, రొమాన్స్ వంటి అంశాలతో దర్శకులు సినిమాలు చేస్తారు. అలాగే 60 ఏళ్ల హీరోని 30 ఏళ్ల అమ్మాయి ఇష్టపడటం. ఆయన వెనకాల తిరగడం వంటి సన్నివేశాలు చోడోచ్చు. ఇండియన్ ఆడియన్స్ దీన్ని అంగీకరిస్తారు. సదరు సన్నివేశాలు ఎంజాయ్ చేస్తారు.
రవితేజ వయసు దాదాపు 57 ఏళ్ళు. అంటే ఆరుపదుల వయసుకు ఆయన వచ్చేశారు. అయితే ఆయనతో నటించే అమ్మాయిల వయసు కేవలం 25 ఏళ్ళు కూడా ఉండటం లేదు. ఈ తరం యంగ్ హీరోయిన్స్ ని తన సినిమాల్లో హీరోయిన్స్ గా ఎంచుకుంటున్నాడు. ధమాకా సినిమాలో నటించిన శ్రీలీలకు పట్టుమని పాతికేళ్ళు లేవు. మాస్ జాతర మూవీలో మరోసారి ఆయనకు జంటగా నటిస్తుంది. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకుడు.
రవితేజ లాస్ట్ రిలీజ్ మిస్టర్ బచ్చన్ లో భాగ్యశ్రీ బోర్సే నటించింది. 1999లో భాగ్యశ్రీ వయసు కేవలం 25 ఏళ్ళు. మిస్టర్ బచ్చన్ మూవీలో ఓ సాంగ్ లో రవితేజ ఆమె చీర కుచ్చిళ్ళలో చేయి పెట్టి చేసిన డాన్స్ మూమెంట్ వివాదాస్పదం అయ్యింది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ కాగా, దర్శకుడు హరీష్ శంకర్ ని సైతం జనాలు ఏకి పారేశారు. కాగా నెక్స్ట్ రవితేజ దర్శకుడు కిషోర్ తిరుమలతో మూవీకి సిద్ధం అవుతున్నాడట. త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందట. ఈ సినిమాకు అనార్కలి అనే టైటిల్ పరిగణలో ఉందట.
కాగా ఈ చిత్రంలో హీరోయిన్స్ గా కయాడు లోహర్, మమిత బైజు లను తీసుకుంటున్నారట. ప్రేమమ్ చిత్రంతో మమిత, డ్రాగన్ విడుదల తర్వాత కయాడు సోషల్ మీడియాను షేక్ చేశారు. వీరిద్దరూ ఒకేలా ఉంటారనే వాదన కూడా ఉంది. 2000లో పుట్టిన కయాడు ఏజ్ 24 ఏళ్ళు కాగా, 2001లో జన్మించిన మమిత వయసు జస్ట్ 23. ఈ వార్తల నేపథ్యంలో రవితేజ యంగ్ బ్యూటీస్ ని హీరోయిన్స్ గా కోరుకుంటున్నాడనే వాదన మొదలైంది. అయితే రవితేజ ప్రమేయం ఏముంది?. దర్శకుడు ఎంపిక చేసిన హీరోయిన్స్ తో ఆయన నటిస్తున్నాడని కొందరు సమర్థిస్తున్నారు. అదన్నమాట మేటర్.
Web Title: Interesting updates about ravi tejas new movies
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com