Junior NTR : జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) వీరాభిమాని కౌశిక్(Kaushik) చాలా కాలం నుండి క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తన కొడుకు చివరి కోరిక ‘దేవర'(Devara Movie) సినిమా చూడాలని ఉంది అన్నాడంటూ అతని తల్లి అప్పట్లో ఏడుస్తూ ఒక వీడియో ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా లో బాగా వైరల్ చేసారు. విషయం ఎన్టీఆర్ వరకు చేరడంతో వెంటనే ఆయన స్పందించి కౌశిక్ తో వీడియో కాల్ లో మాట్లాడడం, ఆ తర్వాత అతని వైద్యానికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం వంటివి జరిగాయి. కోలుకున్నాడు ఇక నుండి మామూలు మనిషి అవుతాడని అందరూ అనుకుంటున్న సమయం లో నిన్న రాత్రి ఆయన తన తుది శ్వాసని వదిలినట్టు తెలుస్తుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్ లో ‘#WeMissYouKaushik’ అంటూ ట్వీట్లు వేస్తున్నారు.
Also Read : ఎన్టీఆర్ కి ఏమైంది..? ఎందుకిలా అయిపోయాడు..అవేమి లుక్స్ బాబోయ్ అంటున్న నెటిజెన్స్!
కౌశిక్ ఆరోగ్యాన్ని మాములు స్థితికి తీసుకొచ్చేందుకు అందరూ ఎంతో సహాయపడ్డారు. ఎన్టీఆర్ అభిమానులతో పాటు, టీటీడీ బోర్డు నుండి కూడా కౌశిక్ చికిత్స కి అవసరమైన డబ్బులు మొత్తం సమకూర్చారు. రీసెంట్ గానే అతని తల్లి మీడియా ముందుకు వచ్చి, తమ కొడుకుకి వైద్యం పూర్తి అయ్యిందని, కానీ డీఛార్జి చేయడానికి హాస్పిటల్ వాళ్ళు 15 లక్షల రూపాయిలు అడుగుతున్నారని, ఎన్టీఆర్ మ్యానేజర్ గారికి ఫోన్ చేస్తే మేము ఇవ్వము, ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పారంటూ కొద్దిరోజుల క్రితమే పెద్ద రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ వరకు చేరడంతో వెంటనే డబ్బులు కట్టి కౌశిక్ ని డిశ్చార్జ్ చేయించాడు. ఇక అంతా మామూలే, అందరిలాగానే కౌశిక్ జనాల్లో కలిసి తిరుగుతాడు అని అందరూ అనుకున్నారు కానీ, చివరికి ఇలా అయ్యింది. పాపం కౌశిక్ తల్లి ఆవేదన దగ్గర నుండి చూసిన వాళ్లకు గుండెలు తరుక్కుపోయేలా చేసింది. బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఆ తల్లి పెద్ద యుద్ధమే చేసిందని అనుకోవచ్చు.
Also Read : ఆ ముగ్గురితో సీన్ అంటే ఎన్టీఆర్ కి చాలా కష్టం.. టేకులు మీద టేకులు! ఎందుకు అలా?