Rohit Sharma : ఈసారి ఎలాగైనా ట్రోఫీ అందుకోవాలని టీమ్ ఇండియా భావిస్తున్నది. అందువల్లే పకడ్బందీ ప్రణాళికతో బరిలోకి దిగింది. లీగ్ దశలో బంగ్లాదేశ్(IND vs BAN), పాకిస్తాన్(IND vs PAK), న్యూజిలాండ్(IND vs NZ) జట్లపై గెలిచింది. గ్రూప్ – ఏ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా(IND vs AUS) పై సెమీ ఫైనల్ మ్యాచ్లో గెలిచింది. 2024లో జరిగిన టి20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలిచేలా చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆ విజయం తర్వాత టి20లకు వీడ్కోలు పలికాడు. రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ కూడా టి20 లకు గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లోకి టీం ఇండియా వెళ్లిన నేపథ్యంలో రోహిత్ శర్మ నిర్ణయంపై అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Also Read : రోహిత్ విషయంలో.. అవన్నీ గాలి కబుర్లు..: సూర్య కుమార్ యాదవ్
ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, బంగ్లాదేశ్ ఆటగాడు ముష్పీకర్ రహీమ్ వన్డేలకు వీడ్కోలు పలికారు. ఇలాంటి కెప్టెన్ జోస్ బట్లర్ కూడా తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ క్రమంలో టీమిండియా నుంచి ఎవరు వన్డేలకు వీడ్కోలు పలుకుతారనేది ఆసక్తికరంగా మారింది. గత టి20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టి20లకు వీడ్కోలు పలికాడు. రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ కూడా అదే దారి అనుసరించారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions trophy 2025) తర్వాత రోహిత్ వీడ్కోలు పలుకుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఫైనల్లో ఒకవేళ భారత్ గనుక గెలిస్తే రోహిత్ వడ్డే లకు వీడ్కోలు పలికే అవకాశం ఉందని బిసిసిఐ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ రోహిత్ గనుక ఆ నిర్ణయం తీసుకుంటే సెంట్రల్ కాంట్రాక్టులో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే రోహిత్ శర్మ తీసుకునే నిర్ణయం పై బీసీసీఐ పెద్దలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ” రోహిత్ టీమ్ ఇండియాకు ఛాంపియన్స్ ట్రోఫీని అందివ్వాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే అతడు జట్టులో స్ఫూర్తిని నింపుతున్నాడు. ఆటగాళ్లలో కసిని పెంచుతున్నాడు. ఒకవేళ టీమ్ ఇండియా గనుక ట్రోఫీ సాధిస్తే అతడు కచ్చితంగా వన్డేలకు వీడ్కోలు పలికే అవకాశం ఉందని” జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ ఇప్పటికే మేనేజ్మెంట్ కి చెప్పేశాడని..టీమ్ మీటింగ్లో స్పష్టత ఇచ్చాడని తెలుస్తోంది. ఇక రోహిత్ గనుక వన్డేలకు వీడ్కోలు పలికితే.. వన్డే జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ లేదా గిల్ కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియాకు వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.
Also Read :