IND vs ENG : టాస్ గెలవడమే టీమ్ ఇండియాకు(team India) వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. మైదానం పై ఉన్న తేమను బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండు బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లను సాధించారు. ఇక ఫీల్డింగ్ లోనూ భారత క్రికెటర్లు(Indian cricketers) మెరుపులు మెరిపించారు. కీలక ఆటగాళ్లను క్యాచ్ లు పట్టి అవుట్ చేశారు. బౌండరీ లైన్ వద్ద చురుకుగా కదిలి ఇంగ్లాండ్ పరుగులు చేయకుండా కట్టడి చేయగలిగారు. దీంతో ఇంగ్లాండ్ 132 పరుగుల వద్దే ఆగిపోవాల్సి వచ్చింది. టీమిండియా ఆటగాళ్లు అన్ని విభాగాలలో సత్తా చాటడంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది.. ఆ జట్టులో బట్లర్(68) మినహా మిగతా వారెవరూ భారత బౌలర్లను ప్రతిఘటించలేకపోయారు. ఒకవేళ గనుక బట్లర్ ఆ మాత్రం స్కోర్ చేయలేక పోతే ఇంగ్లాండ్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.
సంజు హిట్, అభిషేక్ శర్మ సూపర్ హిట్
టీమిండియా 133 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగగా.. తొలి వికెట్ కు అభిషేక్(Abhishek Sharma) శర్మ, సంజు శాంసన్(Sanju Shamsun) 41 పరుగులు జోడించారు. సంజు 20 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 26 పరుగులు చేశాడు. భారీ స్కోర్ చేసే క్రమంలో ఆర్చర్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav) అర్థం పర్థం లేని షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత తిలక్ వర్మ(Tilak Verma), మరో ఓపెనర్ అభిషేక్ శర్మ టీమిండియా స్కోరును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్ల బౌలింగ్ ను ఊచ కోత కోశాడు. 34 బంతుల్లో ఐదు ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 79 పరుగులు చేశాడు.. తిలక్ వర్మ(Tilak Verma) తో కలిసి నాలుగో వికెట్ కు 42 బంతుల్లో 84 పరుగులు జోడించాడు. 79 పరుగులు చేసిన అభిషేక్ శర్మ(Abhishek Sharma) అబ్దుల్(Abdul Rashid) రషీద్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. అప్పటికే ఇంగ్లాండ్ ఓటమి దాదాపుగా ఖాయం అయింది. ఈ దశలో వచ్చిన హార్దిక్ పాండ్యా(Hardik Pandya)(3), తిలక్ వర్మ(Tilak Verma) (19) మిగతా లాంఛనం పూర్తి చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్(Archer) 2 వికెట్లు, అబ్దుల్ రషీద్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక ఈ సిరీస్ లో రెండవ టి20 మ్యాచ్ జనవరి 26న చెన్నై(Chennai) వేదికగా జరుగుతుంది.