Chiranjeevi-Anil Ravipudi Movie : రాజమౌళి తర్వాత మన టాలీవుడ్ లో అపజయమే అనేదే తెలియని దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది అనిల్ రావిపూడినే. శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఈయన, ‘పటాస్’ చిత్రంతో డైరెక్టర్ గా వెండితెర అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత వరుసగా ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘ఎఫ్ 3’, ‘భగవంత్ కేసరి’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో కమర్షియల్ జానర్ సినిమాలు తీయాలంటే ఈ జనరేషన్ లో అనిల్ రావిపూడి తర్వాతే ఎవరైనా అనే పేరుని తెచ్చుకున్నాడు. సీనియర్ హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు ఇప్పుడు అనిల్ రావిపూడితో సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తర్వాత ఆయన మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న అనీల్ రావిపూడి, త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి తో చేయబోయే స్క్రిప్ట్ పై పని చేయబోతున్నాడు. రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ‘ఈ చిత్రం చేయాలనీ అనుకున్నాం అంతే, ఇంకా ఎలాంటి స్క్రిప్ట్ ని సిద్ధం చేయలేదు. కానీ నా మనసులో ఒక ఆలోచన ఉంది. మెగాస్టార్ చిరంజీవి ని ఇప్పటి వరకు అభిమానులు, ప్రేక్షకులు అన్ని తరహా జానర్ సినిమాల్లో చూసేసారు. కానీ నేను ఇప్పటి వరకు ఆయన ముట్టుకోని జానర్ ని ప్రయత్నించబోతున్నాను. ఈ కాన్సెప్ట్ అభిమానుల ఊహలకు మించి ఉంటుంది. మా ఇద్దరి కాంబినేషన్ ఇలాంటి జానర్ పై సినిమా ని ఎవ్వరూ ఊహించి ఉండరు. అంతలా షాక్ అవుతారు. మెగాస్టార్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని చేయడమే నా లక్ష్యం’ అంటూ చెప్పుకొచ్చాడు అనీల్ రావిపూడి.
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు అనిల్ రావిపూడి ప్లానింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠతో ‘విశ్వంభర’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓడేలా తో ఒక సినిమా చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసాడు. ఈ చిత్రానికి న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం తో పాటు అనీల్ రావిపూడి సినిమా కూడా మొదలు కాబోతుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి ద్రుష్టి మొత్తం ‘విశ్వంభర’ మూవీ పైనే ఉంది. టాకీ పార్ట్ దాదాపుగా పూర్తి అయ్యినట్టే. VFX వర్క్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ద్రుష్టి సారించి, ఎక్కడా తగ్గకుండా చూసుకుంటున్నాడట. టీజర్ లో VFX వర్క్ బాగాలేదని సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్స్ ని ఎదురుకున్న నేపథ్యంలో మళ్ళీ VFX పై రీ వర్క్ చేయిస్తున్నట్టు సమాచారం.