IND VS ENG : ఇండియన్ టీం వరుస విజయాలను అందుకుంటూ మంచి ఫామ్ లో ఉంది.ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఈనెల 25వ తేదీ నుంచి ఇండియన్ టీం ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది.ఇక ఈ సీరీస్ లో మొత్తం ఐదు టెస్టులు ఆడాల్సి ఉండగా, మొదటి టెస్ట్ మ్యాచ్ మాత్రం చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నారు. ఈ పిచ్ మీద ఇండియాకి మంచి రికార్డులు ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ ప్లేయర్లని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్లు గత రెండు సంవత్సరాల నుంచి బజ్ బాల్ గేమ్ ఆడుతూ మంచి విజయాలు అందుకుంటూ వస్తున్నారు.
కాబట్టి వాళ్లని నమ్మడానికి వీల్లేదు, వాళ్లని దీటు గా ఎదుర్కొని కటడి చేస్తే తప్ప ఈ టెస్ట్ మ్యాచ్ లో మనం విజయం సాధించలేం. అలాగే ఈ పిచ్ ఎక్కువగా స్పిన్నర్స్ కి అనుకూలిస్తుంది కాబట్టి ఇంగ్లాండ్ లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన మాథ్యు జాక్ లీచ్ ఈ మ్యాచ్ లో కీలకపాత్ర వహించబోతున్నట్టుగా కనిపిస్తున్నాడు. గత కొద్ది రోజుల నుంచి ఆయన టీమ్ కి దూరంగా ఉంటున్నప్పటికీ ఈ సిరీస్ కి మాత్రం తను సెలెక్ట్ అయ్యాడు. ఇప్పటి వరకు 35 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన జాక్ లీచ్ 124 వికెట్లు తీశాడు. ఇక దాంతో ఆయన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే తప్ప ఇండియన్ టీమ్ ఎక్కువ పరుగులు చేయలేదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ కూడా టీమ్ కి దూరం అయ్యాడు కాబట్టి మిడిల్ ఆర్డర్ లో టీమ్ భారం మొత్తం కేఎల్ రాహుల్ మోయాల్సి వస్తుంది.
మిడిల్ ఆర్డర్ లో లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్లు ఎక్కువగా లేకపోవడం వల్ల జాక్ లీచ్ బౌలింగ్ ని ఎదుర్కోవడం కొంతవరకు మన ప్లేయర్లకు కష్టమనే చెప్పాలి. ఇంతకుముందు రిషబ్ పంత్ టీమ్ లో ఉన్నప్పుడు తను లెఫ్ట్ హండర్ కాబట్టి ఇలాంటి బౌలర్లను ఈజీగా ఎదుర్కొనేవాడు కానీ ఇప్పుడు లెఫ్ట్ హ్యండర్ ప్లేయర్లు ఎక్కువగా లేకపోవడం వల్ల ఇండియన్ టీం కి అది కూడా ఒక మైనస్ పాయింట్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి…
ఇక ఇండియన్ టీమ్ కూడా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. అందులో రవిచంద్రన్ అశ్విన్,రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లాంటి ముగ్గురు టాప్ క్లాస్ స్పిన్నర్స్ ఉండడం కూడా ఇండియన్ టీమ్ కి చాలా వరకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. ఇక పేసర్లలో బుమ్రా, సిరాజ్ టీమ్ బౌలింగ్ భారాన్ని మోయడానికి రెడీగా ఉన్నారు.
ఇక మన అంచనా ప్రకారం ఈ మ్యాచ్ లో ఆడే ఇండియన్ టీమ్ ని కనక ఒకసారి చూసుకున్నట్టయితే…
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (కీపర్), రవీంద్ర జడజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర పటేల్, జాస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్…