Ali: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అలీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు. ఇక పవన్ కళ్యాణ్ తను నటించే ప్రతి సినిమాలో అలీ కోసం సపరేట్ గా ఒక క్యారెక్టర్ ని కూడా డిజైన్ చేయించేవాడు. ఆలీ లేకుండా తను సినిమా చేయలేను అని చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పాడు.
ఇక వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఇండస్ట్రీ మొత్తం చాలా బాగా చెప్పుకునేవారు, అలాగే కొంతమంది వీళ్ల ఫ్రెండ్షిప్ ని చూసి కుళ్ళుకునే వారు. ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ జనసేన అనే రాజకీయ పార్టీని పెట్టి రాజకీయంగా ముందుకు కదులుతున్న సమయంలో అలీ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా వైసిపి పార్టీలో చేరాడు. ఇక దాంతో అలీ అప్పుడు చాలా విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అలీ మీద ఏ రకంగాను స్పందించలేదు. అలీ వైసిపి పార్టీలో ఏదో గొప్ప పదవి ఇస్తారని ఆశపడి ఆ పార్టీ లో చేరాడు అంటూ అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేశారు.
కానీ అక్కడ ఆశించిన మేరకు అలీ కి అవకాశం దొరక్కపోయేసరికి ప్రస్తుతం మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీలో చేరాలని చూస్తున్నట్టు గా కొంత మంది రాజకీయ వేత్తల నుంచి కూడా సమాచారం అయితే అందుతుంది. ఇక ఇది తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం అలీ ని పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే లేదు అంటూ కామెంట్లు చేస్తున్నట్టు గా తెలుస్తుంది.
ఇక ఎప్పుడైతే అలీ పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా వైసిపి పార్టీలో చేరాడో అప్పటి నుంచి ఆయనకు సినిమా అవకాశాలు కూడా చాలా వరకు తగ్గాయి. ఆయన్ని పెద్దగా సినిమాల్లోకి కూడా తీసుకోవడం లేదు. ఇక దాంతో అటు రాజకీయంగా, ఇటు సినీ కెరియర్ పరంగా భారీగా నష్టపోతున్న అలీ మొత్తానికైతే పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలని చూస్తున్నాడు అంటూ నెటిజన్ల నుంచి సమాచారం అయితే అందుతుంది. మరి ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో తెలియాల్సి ఉంది…