Homeక్రీడలుక్రికెట్‌IND vs BAN : అది రిషబ్ మార్క్ షాట్.. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా...

IND vs BAN : అది రిషబ్ మార్క్ షాట్.. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా బౌలర్ పుచ్చె పగిలేది.. వీడియో వైరల్

IND vs BAN : చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో రిషబ్ పంత్ తనదైన స్టైల్ బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. చెన్నై మైదానం పౌలర్లకు అనుకూలంగా మారినప్పటికీ.. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ మైదానంపై నిలదొక్కుకోవడం కష్టమైనప్పటికీ రిషబ్ పంత్ అటాకింగ్ ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో వేగంగా 39 రన్స్ చేశాడు. ధాటిగా ఆడే క్రమంలో ఔట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్ లో ఆరు బౌండరీలున్నాయి. ఇక రెండవ ఇన్నింగ్స్ లో క్రీజ్ లోకి వచ్చిన రిషబ్ పంత్ వచ్చి రాగానే బ్యాట్ తో తాండవం చేశాడు. ఆడుతోంది టెస్ట్ అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. టి20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. వరుస బంతుల్లో 4,6 కొట్టాడు.. ఇందులో ఒక సిక్సర్ క్రీజ్ దాటి కొట్టాడు. అతడు అలా కొట్టగానే ఆ బంతి వేగంగా బౌలర్ తల మీది నుంచి వెళ్ళిపోయింది. బౌలర్ అప్రమత్తం కావడంతో ముప్పు తప్పింది. లేకుంటే అతడి తల పుచ్చకాయ లాగా పగిలిపోయేది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. అప్పటికే రోహిత్ శర్మ (5), యశస్వి జైస్వాల్ (10), విరాట్ కోహ్లీ (17) అవుట్ అయినప్పటికీ.. రిషబ్ పంత్ ఏమాత్రం భయపడకుండా దూకుడుగా ఆడాడు. తన బ్యాటింగ్ స్టైల్ తో టీమిండియా ఆటగాళ్లను ఆశ్చర్యపరిచాడు..

వరుసగా రెండు బంతులను..

భారత్ సెకండ్ ఇన్నింగ్స్ లో బంగ్లా బౌలర్ షకీబ్ అల్ హసన్ 21 ఓవర్ వేశాడు. ఈ సందర్భంగా చివరి రెండు బంతులను రిషబ్ పంత్ బౌండరీకి పంపించాడు. ఐదో బంతిని స్వీప్ షాట్ ఆడాడు. స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీ కొట్టాడు. తర్వాత బంతిని క్రీజ్ దాటి కొట్టాడు. బౌలర్ తల మీద నుంచి సిక్సర్ కొట్టాడు. బౌలర్ అప్రమత్తం కావడంతో ఇబ్బంది తప్పింది.. లేకుంటే అతడి తల పగిలిపోయేది. పంత్ కొట్టిన సిక్సర్ చూసి బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. బంతి గాల్లో లేచి బౌండరీని దాటుతుండగా..అలా చూస్తుండి పోయారు.. పంత్ కొట్టిన సిక్సర్ చూసి నెటిజన్లు ప్రశంసల జలు కురిపిస్తున్నారు.. “బాబోయ్ అదేం షాట్ రా బాబూ.. అంతటి గుండె ధైర్యంతో ధాటిగా ఆడాలంటే మామూలు విషయం కాదని” కామెంట్స్ చేస్తున్నారు. “రిషబ్ పంత్ అద్భుతమైన ఆటగాడని.. ఐపీఎల్ లో సూపర్ బ్యాటింగ్ తో అలరించాడని.. వచ్చే రోజుల్లో అతడు టీమ్ ఇండియాకు కెప్టెన్ అవుతాడని అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు. రెండవ ఇన్నింగ్స్ లో పంత్ సెంచరీ చేయాలని కోరుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper