ICC Odi Rankings
ICC ODI Rankings: అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్ స్థానంలో వన్డే వరల్డ్ కప్‌లో అడుగు పెట్టిన టీమిండియా.. ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. నంబర్ వన్ స్థానానికి తగ్గట్లుగానే వన్డే వరల్డ్ కప్‌లో ప్రదర్శన చూపుతోంది. ఈ క్రమంలో ఐసీసీ ఇటీవల జట్ల ర్యాంకులు ప్రకటించింది. అందులోనూ టీమిండియా నంబర్ వన్ స్థానంలో నిలవగా, తాజాగా ఆటగాళ్ల ర్యాంకులు విడుదల చేసింది. ఇందులోనూ భారత ఆగటాళ్లు సత్తా చాటారు.
దూసుపోతున్న రోహిత్..
టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ ఇంటర్నేషనల్ వన్డే ర్యాంకుల్లో దూసుకుపోయాడు. వన్డే వరల్డ్ కప్‌తో తొలి మూడు మ్యాచ్‌ల్లో సత్తా చాటిన రోహిత్ మరోసారి టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ఏకంగా 5 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్ లో నిలిచాడు. గతవారం టాప్ 10లో స్థానం కోల్పోయిన హిట్ మ్యాన్ మళ్లీ పుంజుకుని తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. అఫ్ఘనిస్తాన్ తో జరిగి మ్యాచ్‌లో సెంచరీ(131)తో పాటు పాకిస్తాన్‌తో జరిగి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (86)తో అదరగొట్టాడు.
నంబర్ వన్ ఆయనదే..
ఇక మొదటి స్థానంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కంటిన్యూ అవుతున్నాడు. టీమిండియా సూపర్ స్టార్ శుభ్‌మన్ గిల్ రెండో ర్యాంక్‌ను పదిలంగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీతో చెలరేగిన సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని మూడవ ర్యాంకులోకి వచ్చేశాడు. విరాట్ కోహ్లి 8, కేఎల్ రాహుల్ 19 ర్యాంకుల్లో ఉన్నారు. అఫ్ఘన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 49 స్థానాలు జంప్ చేసి 18వ ర్యాంక్ దక్కించుకున్నాడు. నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 16 స్థానాలు ఎగసి 27వ ర్యాంక్ లోకి ఎంటర్ అయ్యాడు.
బౌలింగ్‌లో..
ఇక బౌలింగ్ ర్యాంకులలో ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ టాప్‌లో ఉన్నాడు. టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ 3వ ర్యాంక్‌కు పడిపోయాడు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ రెండో ర్యాంక్ కు చేరుకున్నాడు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 8వ ర్యాంక్‌లో కంటిన్యూ అవుతున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లు రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ వరుసగా నాలుగు, ఐదు ర్యాంకుల్లో ఉన్నారు. మొత్తంగా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా కీలక ఆటగాళ్లు టాప్ టెన్ ర్యాంకుల్లో ఉన్నారు.