Glenn Maxwell : ప్రస్తుతం ఐపీఎల్ జోరుగా సాగుతోంది. 18 వ ఎడిషన్ ప్రారంభంలోనే అభిమానుల మనసును విపరీతంగా దోచుకుంటున్నది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు జరిగినప్పటికీ.. అన్ని కూడా ప్రేక్షకులకు అసలు సిసలైన క్రికెట్ ఆనందాన్ని అందించాయి. అయితే ఇందులో భారీగా అంచనాలు ఉన్న కొందరు ఆటగాళ్లు విఫలం కాగా.. మరికొందరు ధ్రువ తారలు వెలుగులోకి వచ్చారు.. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆటగాళ్లు విఫలం కావడం అటు జట్టు యాజమాన్యాలనే కాదు.. జట్టును విపరీతంగా ప్రేమించే అభిమానులను కూడా తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు. ఈ జాబితాలో గ్లెన్ మాక్స్ వెల్(Glenn Maxwell) కూడా చేరిపోయాడు.. గత ఐపిఎల్ లో బెంగళూరు జట్టు (Royal challengers Bengaluru) తరఫున ఆడిన అతడు.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. బలంగా బ్యాటింగ్ చేసే అతడు సున్నా పరుగులకే పలుమార్లు అవుట్ అయ్యాడు. దీంతో అతడిని ఒక మ్యాచ్ ఆడకుండా తప్పించారు. తదుపరి మ్యాచ్ కు అవకాశం కల్పించినప్పటికీ.. అతడు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో గత వేలంలో మాక్స్ వెల్ ను బెంగళూరు జట్టు వద్దనుకొంది. సొంతంగా అతడు వేలంలోకి వెళ్లిపోయాడు. అతడిని పంజాబ్ (kings XI Punjab) 4.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయినప్పటికీ అతడు తన ఆట తీరు మార్చుకోలేదు.. ఐపీఎల్ లో భాగంగా మంగళవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టుతో జరిగిన మ్యాచ్లో మాక్స్ వెల్ (0) డక్ ఔట్ అయ్యాడు.. సాయి కిషోర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయి.. నిరాశగా పెవిలియన్ చేరుకున్నాడు. సాయి కిషోర్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన మాక్స్ వెల్ ఎల్బిడబ్ల్యు గా అవుట్ అయ్యాడు.
Also Read : అశుతోష్ శర్మ కు బంపర్ ఆఫర్.. ఢిల్లీ ఆటగాడి పంట పండింది పో..
ఐపీఎల్ లో చెత్త రికార్డు
సాయి కిషోర్ బౌలింగ్లో ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయిన మాక్స్ వెల్.. ఐపీఎల్ లో చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ లో అత్యధిక సార్లు (19) 0 పరుగులకే అవుట్ అయిన ఆటగాడిగా మాక్స్ వెల్ నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో రోహిత్ శర్మ (18), దినేష్ కార్తీక్ (18), పీయూష్ చావ్లా (16), సునీల్ నరైన్ (16) ఉన్నారు. మాక్స్ వెల్ సున్నా పరుగులకే అవుట్ కావడంతో.. సోషల్ మీడియాలో అతనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ” ఆస్ట్రేలియా జట్టుకైతే అతడు పరుగుల వరద పారిస్తాడు. ఓడిపోయే మ్యాచ్ గెలిపిస్తాడు. కానీ టి20లో వచ్చేసరికి ఇలా అవుట్ అవుతాడు. ఇటువంటి ఆటగాడిని ఐపీఎల్ లో ఎందుకు కొనుగోలు చేస్తారో అర్థం కావడం లేదు. బహుశా ఇక్కడికి ఇదే చివరి సీజన్ కావచ్చని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Read : మ్యాచ్ లో మాత్రమే ప్రత్యర్థులు.. ఆ తర్వాత స్నేహితులు.. వీడియో వైరల్