spot_img
Homeఆధ్యాత్మికంUgadi Festival 2026: ఉగాది ఎప్పుడు జరుపుకోవాలి అసలు ముహూర్తం ఏంటంటే

Ugadi Festival 2026: ఉగాది ఎప్పుడు జరుపుకోవాలి అసలు ముహూర్తం ఏంటంటే

Ugadi Festival 2026: తెలుగు ప్రజల నూతన సంవత్సరమైన ఉగాది వేడుకలను ప్రతి ఏటా ఆనందోత్సవాలతో జరుపుకుంటూ ఉంటారు. చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం పాడ్యమి రోజున తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఉగాది వేడుకలను నిర్వహించుకుంటారు. యుగం అంటే సంవత్సరం.. ఆది అంటే మొదలు.. ఉగాది అంటే తెలుగు సంవత్సరం ప్రారంభం అని అర్థం. ఉగాది రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యక్రమాలతో ప్రతి తెలుగు ఇంట్లో సందడి వాతావరనం ఉంటుంది. అయితే నేటి తరం వారు ఉగాది రోజున ఎలాంటి పనులు చేయాలో అవగాహన లేకుండా ఉన్నారు. అలాంటి వారికోసం కొందరు పండితులు చెబుతున్న ప్రకారం ఈ రోజున ఇలాంటి పనులు చేయాలి? ఎప్పుడు పూజలు నిర్వహించాలి? అనే వివరాల్లోకి వెళ్దాం..

Also Read: దురంధర్ రివ్యూ : పాకిస్తాన్ పాలిట యమకింకరుడు

ఉగాది రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఈ రోజున సాధారణంగా కాకుండా అభ్యంగన స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉండనున్నాయి. అంటే తలకు నూనె రాసి స్నానం చేయడం వల్ల శరీరంతో పాటు మనసు శుద్ధిగా మారుతుందని భావిస్తారు. అనంతరం కొత్త బట్టలు ధరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ పూజలు నిర్వహించిన తర్వాత ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఉగాది పచ్చడలో ఆరు రుచుల సమ్మేళనం ఉంటుంది. బెల్లం నుంచి తీపి, వేప నుంచి చేదు, మిరప నుంచి కారం, చింతపండు నుంచి పులుపు, మామిడి నుంచి వగరు తో పాటు కలిపి పచ్చడిని తయారు చేస్తారు. జీవితంలో సుఖదుఃఖాల గురించి ఈ ఉగాది పచ్చడి తెలుపుతుందని కొంతమంది పండితులు చెబుతారు.

అయితే ఉగాది పండుగ రోజు ఏ సమయంలో ఎలాంటి పనులు చేయాలి? అన్న సందేహం కొందరిలో ఉంది. కొంతమంది పండితులు తెలుపుతున్న ప్రకారం ఉదయం 6.53 గంటల నుంచి 9.30 మధ్యలో కొత్త కార్యక్రమాలను ప్రారంభించడం మంచిది అని అంటున్నారు. అంటే విద్య, గృహ కార్యక్రమాలతో పాటు వ్యాపారంలో పెట్టుబడులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే శుభ ఫలితాలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో చేయాలనుకునే ముఖ్యమైన పనులను ఈ రోజున ఈ సమయంలో ప్రారంభించడం వల్ల సంవత్సరం అంతా విజయాలు పొందుతారని చెబుతున్నారు. అంతేకాకుండా పంచాంగ శ్రవణం వినాలని అనుకునేవారు ఇదే సమయం అనుకూలమని చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు అంతా కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం ద్వారా ఐకమత్యం వెలువడుతుంది.

ఉగాది రోజున ఉదయం ఇంటిని శుద్ధి చేసి గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోవడం ఎంతో శుభప్రదం అని అంటున్నారు. ఎందుకంటే ఇవి ఇంటికి శుభశక్తిని తీసుకువస్తాయి. అలాగే నెగిటివ్ శక్తులను దూరం చేస్తాయి. ఇంటిముందు రంగవల్లులు వేయడం కూడా పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version